Home తాజా వార్తలు నకిలీ నోట్లపై ఆర్‌బిఐ ఆందోళన

నకిలీ నోట్లపై ఆర్‌బిఐ ఆందోళన

money

ముంబయి: కొత్త్తగా చెలామణిలోకి వచ్చిన 2000, 500 నోట్లకు నకిలీ మకిలీ అంటుకుంటోంది. ఇటీవల వరుస ఘటనలతో మేల్కొన్న రిజర్వ్ బ్యాంకు సిసిఎస్‌కు ఇచ్చి న ఫిర్యాదు తో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కలర్ జిరాక్స్‌తోనే వాటిని తయా రు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. నకిలీ నోట్లపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ఆర్‌బిఐ సూచించింది. నకిలీలకు తావు లేకుం డా భద్రతా ప్రమాణాలతో తీసుకొచ్చామని కేంద్రం ఊదరగొట్టినా కొత్త నోట్లకు నకిలీ బెడద తప్పడంలేదు.  బ్యాం కింగ్ వ్యవస్థలో గతానికి మించి దొంగనోట్లు చెలామణి పెరుగుతుండటం రిజర్వ్ బ్యాంకును ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన 2000,500 రూపాయల నోట్ల తయారీలో పాటించిన ప్రమాణాలపై బ్యాంకర్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడంతో  అక్రమార్కులకు వరంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో పెద్దయెత్తున నకిలీ నోట్లు తయారుచేసి దొంగచాటుగా దేశంలోకి ప్రవేశపెడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంకుకు చేరిన కరెన్సీలో ఏకంగా 26లక్షల మేర నకిలీ కరెన్సీ ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైం ది. ఉన్నత ప్రమాణాలతో కూడిన జిరాక్స్ ద్వారానే ఈ నకిలీ కరెన్సీ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. బయట నుంచి దేశంలోకి వస్తున్న దొంగనోట్లపై ఎన్‌ఐఎ, డిఆర్‌ఐ వంటి కేంద్ర సంస్థలు విచారణ చేపట్టి నిగ్గుతేల్చాల్సి ఉందని ఆర్‌బిఐ అభిప్రాయపడింది. కాగా నకిలీ నోట్లను గుర్తించడంలో విఫలమైన బ్యాంకులపై అపరాధ రుసుము విధిస్తామని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.