Thursday, April 25, 2024

డిజిటల్ లోన్ కంపెనీలకు ఆర్‌బిఐ మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

RBI Guidelines for Digital Loan Companies

అనుమతి పొందిన కంపెనీలకే డిజిటల్ రుణాల అర్హత
 కస్టమర్ వ్యక్తిగత సమాచారం రక్షణ బాధ్యత రుణ సంస్థదే
 మోసాలకు చెక్ పెట్టేందుకు తొలి దశ నిబంధలు జారీ

న్యూఢిల్లీ : మోసాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ రుణాలపై నియంత్రణ కోసం ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ వ్యాపారాలకు అనుమతి ఇచ్చేందుకు గాను డిజిటల్ లోన్, లిస్టింగ్ కంపెనీలకు మొదటి దశ నిబంధలను జారీ చేసింది. రుణాలు, వివరాల సేకరణ, ఎలా ఫీజులను వసూలు చేయాలనే నిబంధనలను రిజర్వు బ్యాంక్ రూపొందించింది. డిజిటల్ రుణాలు ఇచ్చే సంస్థలను మూడు రకాలుగా ఆర్‌బిఐ విభజించింది. రుణగ్రస్తుల బ్యాంక్ ఖాతా, రెగ్యులేటరీ అనుమతి పొందిన సంస్థ మధ్య మాత్రమే అన్ని రకాల రుణాల పంపిణీ, చెల్లింపులు జరగాలి. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ (ఎల్‌ఎస్‌పి) లేదా ఏదైనా ఇతర మూడో పక్షం ఏదైనా పాస్-త్రూ, పూల్ చేసిన ఖాతా రోల్-త్రూ ఉండకూడదు. క్రెడిట్ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎల్‌ఎస్‌పికి చెల్లించే ఏవైనా రుసుములు కస్టమర్ ద్వారా చెల్లింపు ఉండదు, అది నేరుగా నియంత్రిత సంస్థ ద్వారా జరుగుతుంది.

అంబుడ్స్‌మన్ పరిధిలోకి డిజిటల్ లోన్ల ఫిర్యాదులు
డిజిటల్ లోన్ ఫిర్యాదులు అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, వినియోగదారుడు దాఖలు చేసిన ఏదైనా ఫిర్యాదు నిర్ణీత గరిష్ట వ్యవధిలో 30 రోజులలో పరిష్కరించాల్సి ఉంటుంది. పరిష్కారం లభించకపోతే ఆ వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 7 కింద ఫిర్యాదు చేయవచ్చు. కస్టమర్లు ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు మంచి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కస్టమర్ అనుమతి లేకుండా ఏ డిజిటల్ లెండింగ్ కంపెనీ లేదా సంస్థ రుణాలను పంపిణీ చేయడం లేదా రుణ పరిమితిని పెంచడం సాధ్యం కాదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన మార్గదర్శకాలలో పేర్కొంది. రికవరీ కంపెనీ సమాచారాన్ని కస్టమర్‌తో పంచుకోవాల్సి ఉంటుంది.

కొత్త మార్గదర్శకాలు
రెగ్యులేటరీ అనుమతి పొందిన కంపెనీలు లేదా సంస్థలు మాత్రమే వినియోగదారులకు డిజిటల్ రుణాలు ఇవ్వడానికి అర్హత కల్గివుంటాయి.
రుణానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫో కంపెనీలకు ఇవ్వాల్సి ఉంటుంది. రుణాలు ఇస్తున్నప్పుడు, కస్టమర్లు అన్ని ఇతర ఖర్చుల గురించి సమాచారం ఇవ్వాలి.
రుణ ఇవ్వడం, తిరిగి చెల్లింపు ఈ రెండూ కూడా కస్టమర్, కంపెనీ బ్యాంకు ఖాతాల మధ్య మాత్రమే జరగాలి.
కస్టమర్ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన మొత్తం డేటాను రక్షించే బాధ్యత కూడా రుణదాతకే ఉంటుంది. దీంతో పాటు ఏ డిజిటల్ లెండింగ్ కంపెనీ కూడా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేయడానికి వీల్లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News