Home తాజా వార్తలు తలొగ్గిన సెంట్రల్ బ్యాంక్

తలొగ్గిన సెంట్రల్ బ్యాంక్

RBI positive signal to government demands

మిగులు నిల్వల డిమాండ్ పరిశీలించేందుకు అంగీకారం
ఎంఎస్‌ఎంఇల పునరుద్ధరణ పథకం పరిశీలన
బోర్డు సమావేశం అనంతరం రిజర్వు బ్యాంక్ వెల్లడి

ముంబై : మొత్తానికి ప్రభుత్వ డిమాండ్లకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సానుకూల సంకేతాలిచ్చింది. మిగులు నిల్వల బదిలీ సహా పలు కేంద్రం డిమాండ్లను పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. సోమవారం నిర్వహించిన ఆర్‌బిఐ కీలక సమావేశం తొమ్మిది గంటల చర్చల తర్వాత ముగిసింది. కీలక అంశాలపై ఆర్‌బిఐ, ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో సోమవారం జరిగిన భేటీ ఎంతో కీలకంగా మారింది. ఆర్థిక రంగానికి నిధుల లభ్యతను సులభతరం చేయడం, చిన్న వ్యాపారాలకు రుణాలను పెంచడం వంచి అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు రాగా, బోర్డు ఎలాంటి పరిష్కార ముగింపునివ్వలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కీలక ఓటు బ్యాంక్ కల్గిన దేశీయ మారుమూల ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలకు రుణాలను వేగవంతం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఈమేరకు ప్రభుత్వం ఆర్‌బిఐ ఒత్తిడి తెస్తోంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో తాజా సమావేశం సామరస్యంగా జరిగిందనే తెలుస్తోంది.

ఆర్‌బిఐ ప్రభుత్వంపై ముఖ్యాంశాలు

1. రిజర్వ్ బ్యాంక్ బోర్డు -..ఇది సలహా హోదాలో పనిచేస్తుంది.- దీని విధుల్లో ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యనిధి విధానం, విదేశీ మారక నిర్వహణ వంటివి ఉంటాయి. ఇప్పటివరకు ఆర్‌బిఐ బోర్డు.. సలహా హోదాలో గవర్నర్ పటేల్, ఆయన బృందం తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

2. బోర్డులో ప్రభుత్వం నామినేట్ చేసిన ఎస్ గురుమూర్తి, సుభాష్ చంద్ర గార్గ్, రాజీవ్ కుమార్‌లు ఆర్‌బిఐని ప్రభావితం చేస్తారు. బ్యాంకింగ్ పర్యవేక్షణ, పరిశ్రమకు రుణాల ప్రవాహం, రుణదాతలకు ద్రవ్యలభ్యత నిబంధనలను సులభతరం చేయడం గురించి ఈ సభ్యులు తమ స్వరాన్ని వినిపిస్తారు.

3. అదనపు మిగుళ్లు సహా మూడు ప్రధాన అంశాలపై సెంట్రల్ బ్యాంక్, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. ఆర్‌బిఐ వద్ద ఉన్న మిగులు నిల్వలు రూ. 3.6 లక్షల కోట్లను అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వం వాదిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ నిల్వలు అవసరమని ఆర్‌బిఐ వాదిస్తోంది.

4. ఇప్పటికే బారీ మొండి బకాయిలు, తక్కువ మూలధన నిధులతో సతమతమవుతున్న బ్యాంకులపై ఆర్‌బిఐ కఠిన నిబంధనల పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 11 ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాలపై ఆర్‌బిఐ ఆంక్షలు విధించింది. ముందు మూలధన నిధిని పెంచుకోవాలని ఈ బ్యాంకులను డిమాండ్ చేస్తోంది.

5. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సి), ఎంఎస్‌ఎంఇ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లపై ఆర్‌బిఐ చెప్పేదేమిటంటే.. మార్కెట్‌లో తగినంతగా నగదు ఉంది, డిఫాల్ట్ అయిన ఎన్‌బిఎఫ్‌సిలు వ్యక్తిగత కేసులు అని చెబుతోంది. అయితే ఈ రంగాలకు ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఎఇలకు బ్యాంకులు మరింత రుణ సదుపాయం కల్పించేలా ఆర్‌బిఐ అనుమతివ్వాలని ప్రభుత్వం కోరుతోంది. డీమానిటైజేషన్(నోట్ల రద్దు)తో ప్రభావం బారిన పడిన ఈ చిన్న రంగాల్లో 12 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు.

6. కొన్ని బ్యాంకులపై ఆర్‌బిఐ పిసిఎ(తక్షణ దిద్దుబాటు చర్య) కింద కఠిన చర్యలు చేపట్టింది. ఈ కఠిన నిబంధనలను సులభతరం చేయాలని ప్రభుత్వం వాదిస్తోంది.

7. ప్రభుత్వం ఆర్‌బిఐని తన నియంత్రణలోకి తెచ్చుకుని తద్వారా రూ.9 లక్షల మిగుళ్లపై పట్టును సాధించాలని చూస్తోందని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం ఆరోపించారు. ట్విట్టర్ ఆయన ఈ వ్యాఖ్యలు పోస్టు చేశారు.

8. ఎన్నికల సంవత్సరానికి ముందు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనిలో భాగంగానే ఆర్‌బిఐ వద్ద ఉన్న మిగులు నిల్వలను కోరుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

9. ఎన్నికల సంవత్సరంలో వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థను ప్రభుత్వం పెంపొందించడానికి ఆసక్తి చూపిందని ఆరోపణలు వచ్చాయి. దాని మిగులు నిల్వలలో భాగమైన బ్యాంక్ను కోరింది.

10. ఆర్‌బిఐ గవర్నర్ నిరాకరించినప్పుడు.. ఇంతకుముందు ఎన్నడూ వినియోగించని ‘ఆర్బిఐ చట్టం సెక్షన్ 7’ను ప్రయోగించాలని ప్రభుత్వం ఆలోచన అని చిదంబరం ఆరోపిస్తున్నారు. సెక్షన్ 7 కింద ప్రభుత్వానికి ఆర్‌బిఐపై అధికారాలు ఉంటాయి. ప్రజా ప్రయోజనం కోసం ఆర్‌బిఐ చీఫ్‌కు సూచనలు, సలహాలను ఈ సెక్షన్ కింద ప్రభుత్వం ఇచ్చే అధికారం ఉంటుంది.

11. సెంట్రల్ బ్యాంక్ మిగులు నిల్వల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనే నివేదికలను గురుమూర్తి ఖండించారు. ఎంత మేరకు మిగులు నిల్వలు ఉండాలనే దానిపై విధాన నిర్ణయాలను కేంద్రం కోరుతోందని ఆయన అన్నారు. ఆయన పేర్కొన్న ప్రకారం, అధ్యయనాలు 12 నుంచి 18.7 శాతం నిల్వలు ఉండాలి. సెంట్రల్ బ్యాంకు వద్ద 27-28 శాతం వరకు ఉన్నాయి.

పలు కీలక అంశాలపై బోర్డు సమావేశం
వివరాలు వెల్లడించిన ఆర్‌బిఐ  

1. సోమవారం ముంబైలో ఆర్‌బిఐ బోర్డు సమావేశం నిర్వహించారు. బేసల్ రెగ్యులేటరీ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్, ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఇలకు పునరుద్ధరణ పథకం, పిసిఎ(తక్షణ దిద్దబాటు చర్య) కింద బ్యాంకుల ఆరోగ్యం, ఆర్‌బిఐ ఇసిఎఫ్(ఆర్థిక మూలధన వ్యవస్థ) వంటి అంశాలపై చర్చకు వచ్చాయి.

2. ఇసిఎఫ్‌ను పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్‌బిఐ బోర్డు నిర్ణయించింది. దీని సభ్యత్వం, నియమాలు ప్రభుత్వం, ఆర్‌బిఐ సంయుక్తంగా నిర్ణయిస్తాయని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

3. రూ.250 మిలియన్ల వరకు చిన్న వ్యాపారులకు సదుపాయం కల్పించే దిశగా ఆర్‌బిఐ పునరుద్ధరణ చర్యలను పరిశీలించాలని 18 మంది సభ్యుల బోర్డు సూచించిందని ఆర్‌బిఐ తెలిపింది.

4. చివరగా, పిసిఎ పరిధిలోని ప్రభుత్వరంగ బ్యాంకుల విషయాన్ని ఆర్‌బిఐకి చెందిన ఆర్థిక పర్యవేక్షణ బోర్డు (బిఎఫ్‌ఎస్) పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయించారు.

RBI has given a positive signal to government demands

Telangana Latest News