Wednesday, November 30, 2022

రివర్స్ రెపో రేటు పెరగొచ్చు

- Advertisement -

RBI monetary policy committee meeting will begin

 

వడ్డీ రేట్లు యథాతథంగానే ఉండే అవకాశం
ఆర్‌బిఐ ఎంపిసి సమావేశంపై నిపుణులు

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే ఎంపిసి (ద్రవ్య విధాన కమిటీ) సమావేశం ఈ నెల 6న ప్రారంభమై 8వ తేదీ రోజు ముగుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి వివరాలను ఆఖరి రోజు అంటే బుధవారం నాడు వెల్లడిస్తారు. అక్టోబర్‌లో ఆర్‌బిఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్‌బిఐ ఎంపిసి సమావేశంలో రివర్స్ రెపో రేటుపై చర్చలు ముందుగా జరగొచ్చని భావిస్తున్నాం, ఎందుకంటే వడ్డీ రేట్ల పెంపు, ఆ తర్వాత మార్కెట్లో గందరగోళ పరిస్థితులు లేకుండా ఆర్‌బిఐ జాగ్రత్త వహించనుందని ఎస్‌బిఐ పరిశోధన నివేదిక తెలిపింది. ఇక కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, కొత్త కరోనా వేరియంట్ నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది, అందువల్ల రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్‌బిఐ కొంత స్పష్టత కోసం వేచిచూసే అవకాశం ఉంది.

ఆర్‌బిఐ సమీక్షలో స్వల్పంగా రివర్స్ రెపో రేటును పెంచవచ్చని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అంచనా వేసింది. అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ, ఒమిక్రాన్ ఆందోళనలు, ఆర్థిక వ్యవస్థ కోలుకునే దశలో ఉన్న కారణంగా ఆర్‌బిఐ ఈసారి వడ్డీ రేట్లపై వేచిచూసే అవకాశముందన్నారు. గృహ రుణగ్రస్తులు తక్కువ వడ్డీ రేట్లను మరికొంత కాలం ఆనందిస్తారని అన్నారు. బుధవారం ఆర్‌బిఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించినట్లయితే, ఆర్‌బిఐ రేట్లలో మార్పు చేయకపోవడం ఇది వరుసగా తొమ్మిదో సారి అవుతుంది. రిజర్వు బ్యాంక్ గతంలో ఆఖరి సారిగా 2020 మే నెలలో రేట్లను తగ్గించింది. ఇప్పటికీ వడ్డీ రేట్లు చారిత్రక కనిష్ట స్థాయిలో ఉన్నాయి.

RBI monetary policy committee meeting will begin on dec 6

Related Articles

- Advertisement -

Latest Articles