Home తాజా వార్తలు ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా 26 శాతానికి పెంచాలి

ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా 26 శాతానికి పెంచాలి

RBI raise promoters cap in private banks to 26%

 

రూ.50 వేల కోట్లకు పైన ఆస్తులున్న ఎన్‌బిఎఫ్‌సిని బ్యాంక్‌గా మార్చాలి
సార్వత్రిక బ్యాంకులకు కనీస ప్రారంభ మూలధనం 1000కోట్లకు పెంపు
ఆర్‌బిఐ ప్యానెల్ ప్రతిపాదనలు

ముంబై : ప్రైవేట్ బ్యాంకులలో ప్రమోటర్ల వాటా పరిమితిని 26 శాతానికి పెంచాలని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) ఇంటర్నల్ ప్యానెల్ ప్రతిపాదించింది. 15 సంవత్సరాలలో ప్రస్తుతం ఉన్న 15 శాతం నుండి 26 శాతానికి పరిమితిని పెంచాలని ప్యానెల్ సూచించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని సవరించిన తరువాత పెద్ద కంపెనీలు లేదా పారిశ్రామిక సంస్థలను ప్రమోటర్లుగా బ్యాంకుల్లో చేరడానికి అనుమతించవచ్చని ఈ ప్యానెల్ సిఫారసు చేసింది. అదే సమయంలో వాటిని పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపింది.

ఈ ఏడాది జూన్ 12న సెంట్రల్ బ్యాంక్ ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో కార్పొరేట్ నిర్మాణం, యాజమాన్య మార్గదర్శకాలను సమీక్షించే బాధ్యత ఈ బృందానికి ఆర్‌బిఐ అప్పగించింది. ఈ బృందం నివేదికను ఆర్‌బిఐ శుక్రవారం విడుదల చేసింది. రూ.50 వేల కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణంతో ఉన్న ఎన్‌బిఎఫ్‌సిని పదేళ్లు పూర్తి చేసినట్లయితే వాటిని బ్యాంకుగా మార్చాలని కూడా ప్యానెల్ సూచించింది. సార్వత్రిక బ్యాంకులకు కనీస ప్రారంభ మూలధనాన్ని రూ .500 కోట్ల నుంచి రూ .1000 కోట్లకు, చిన్న బ్యాంకులకు, కొత్త బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడానికి రూ .200 కోట్ల నుంచి రూ .300 కోట్లకు పెంచాలని ప్యానెల్ సిఫారసు చేసింది. ప్రైవేట్ బ్యాంకుల పనితీరును మెరుగుపరచడానికి ప్యానెల్ అనేక సిఫార్సులు చేసింది.

RBI raise promoters cap in private banks to 26%