- Advertisement -
ముంబయి : పెద్ద నోట్ల రద్దు తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకు ఖాతాదారులకు ఆర్బిఐ సోమవారం తీపి కబురు అందించింది. బ్యాంకులలో కరెంట్ అకౌంటు కలిగిన ఖాతాదారులకు విత్డ్రా పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. కరెంట్ ఖాతాదారులు ఎటిఎంల నుంచి ఇకపై ఎంతైన డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ విత్డ్రా పరిమితి సేవింగ్స్ ఖాతాలపై అలాగే కొనసాగనుంది. గతంలో ఈ పరిమితి రోజుకు రూ.4,500, వారానికి రూ.24,000 ఉన్న విషయం తెలిసిందే. కాగా పరిమితి ఎత్తివేత బుధవారం నుంచి అమలులోకి రానున్నట్లు ఆర్బిఐ తెలిపింది.
- Advertisement -