Home తాజా వార్తలు డిజిటల్ రుణాలపై ఆర్‌బిఐ దర్యాప్తు బృందం

డిజిటల్ రుణాలపై ఆర్‌బిఐ దర్యాప్తు బృందం

RBI sets up working group to regulate e-platforms

 

ఆన్‌లైన్ రుణ యాప్‌లపై నజర్

న్యూఢిల్లీ : దేశంలో ఆన్‌లైన్ రుణ ప్రక్రియతో తలెత్తుతున్న భారీ మోసాలపై రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బిఐ) దృష్టి సారించింది. డిజిటల్ రుణాలపై అధ్యయనం చేసి, తగు విధంగా వ్యవహరించేందుకు ఓ కార్యాచరణ బృం దాన్ని ఏర్పా టు చేస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం తెలిపారు. ఇటీవలి కాలంలో డిజిటల్ రుణాలతో తలెత్తుతున్న తీవ్ర పరిణామాలు కలవరానికి దారితీస్తున్నాయి. రుణయాప్‌లు, సంబంధిత ఇతరత్రా డిజిటల్ రుణాలతో ఈ మధ్యకాలంలో పలుచోట్ల మానవ విషాద సంబంధిత దారుణాలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి డిజిటల్ రుణాల పద్ధతులలో అవకతవకలు లోటుపాట్లపై కమిటీ అధ్యయనం జరుపుతుంది. ఆర్థిక రంగం లో ఆన్‌లైన్ ప్రక్రియ చాలా మంచిదే, దీనిని స్వాగతించాల్సిందే. అయితే ఈ క్రమంలో ఇది అదుపుతప్పితే పలు ఉపద్రవాలకు దారితీస్తోంది.

ప్రయోజనాలతో పాటు దు ష్పలితాలు సంభవిస్తున్నాయి. వీటిని అరికట్టాల్సి ఉం టుంది. మంచి చెడులను సరైన రీతిలో బేరీజు వేసుకునేందుకు, సమన్వ యం ద్వారా ఈ వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ కమిటీ దోహదం చేస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ వివరించారు. ఈ వర్కింగ్ గ్రూప్‌లో ఆర్‌బిఐలోని, వెలుపలి అధికారులు సభ్యులుగా ఉంటారు. ఆర్‌బిఐకి సంబంధించి ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ జయంత్‌కుమార్ డాష్, ఆర్‌బిఐ చీఫ్ జనరల్ మేనేజర్‌ఇన్ చార్జి అజయ్‌కుమార్ ఇతర అధికారులు పి వాసుదేవన్, మనోరంజన్ మిశ్రా, అజయ్‌కుమార్ చౌదరి సభ్యులుగా ఉంటారని వివరించారు. వెలుపలి సభ్యుల వివరాలు తెలియచేయలేదు. అజయబడేటా భద్ర త, గోప్యత, విశ్వసనీయత, వినయోగదారుల భద్రతనే కీలకం అని తెలిపారు. సరైన నియమ నిబంధనలతోనే ఇది సాధ్యం అని ఆర్‌బిఐ సమగ్ర ప్రకటన వెలువరించింది.

అప్పుల యాప్‌లతో తిప్పలు
ఈ మధ్యకాలంలో అత్యంత ప్రమాదకర రీతిలో డిజిటల్ రుణాలను ఇచ్చే వేదికలు, యాప్స్ వచ్చిపడ్డాయి. రుణాలను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చుననే తాపత్రయంతో వీటిపై పలువురు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో రుణాల ఉచ్చులు చిక్కుకుంటున్నారు. వీటన్నింటిని వర్కింగ్ గ్రూప్‌తగు విధంగా పరిశీలిస్తుంది. నివారణ చర్యలు చేపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను కాలరాస్తూ పదికి పైగా డిజిటల్ యాప్‌లు తలెత్తాయి. రుణాలను మంజూరు చేస్తున్నాయి. వీటి ద్వారా రుణాలు పొంది, తరువాత భారీ వడ్డీలు కట్టలేకపోవడం, సరైన ప్రైవసీ లేకపోవడంతో మానసిక క్షోభతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునే ఆర్‌బిఐ ఈ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసిందని వెల్లడైంది. క్రమబద్థీకరించిన ఆర్థిక రంగంలోకి చొరబడి అనియంత్రిత శక్తులు సృష్టిస్తున్న సమస్యలను కమిటీ పరిశీలిస్తుంది. ఈ శక్తులకు కళ్లెం వేసే మార్గాలను అన్వేషించడం ద్వారా డిజిటల్ రుణాల ప్రక్రియను గాడిలో పెడుతుందని భావిస్తున్నారు.

సరైన నియంత్రిత వ్యవస్థ ఏర్పాటుకు యత్నిస్తుంది. డిజిటల్ లెండింగ్‌తో ద్రవ్య సంబంధిత విషయాల్లో సరళీకృత పరిస్థితి ఏర్పడాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన సేవలు, ఉత్పత్తులు సముచిత రీతిలో సాగేందుకు వీలేర్పడుతుంది. అయితే ఇటీవలి కాలంలో తలెత్తిన పరిణామాలతో ఇందుకు చిక్కులు ఏర్పడుతున్నాయి. యాప్ ప్రాతిపదికన వెలిసిన రుణ సంస్థలు తిమింగలాలుగా మారి, రుణగ్రహీతలకు మరణశాసనం లిఖిస్తున్నాయంటూ ఇటీవలే కొన్ని బిజినెస్ పత్రికలలో వార్తలు వెలువడ్డాయి. వీటిపై ఆర్‌బిఐ నుంచి నియంత్రణ చర్యలు ఏమి లేవని తెలిపాయి. సరైన నియంత్రణలు లేకపోవడం, మానసిక బలహీనతలు, రుణాలు పొందాలనే ఆశలను ఆసరాగా చేసుకుని రుణాలు ఇస్తూ ఈ క్రమంలో వారి విలువైన డాటాను, వారి ధనాన్ని కొల్లగొడుతున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చారు. పలు రుణయాప్‌ల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆత్మహత్యలకు దిగుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కానుంది.

RBI sets up working group to regulate e-platforms