Home తాజా వార్తలు ఎస్‌బిఐపై 7 కోట్ల జరిమానా

ఎస్‌బిఐపై 7 కోట్ల జరిమానా

RBI

 

న్యూఢిల్లీ: ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) గుర్తింపు, మోసం ప్రమాదాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు పాటించని కారణంగా దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐపై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రూ.7 కోట్ల జరిమానా విధించింది. ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (ఐఆర్‌ఎసి), కరెంట్ ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి ప్రవర్తనా నియమావళి, సిఆర్‌ఐఎల్‌సి(సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్)పై డేటాను నివేదించడం, రిస్క్ మేనేజ్మెంట్, వర్గీకరణ, మోసాలను నివేదింతడంలో నిబంధనలను పాటించకపోవడం వల్ల ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)పై జరిమాని విధించినట్టు ఆర్‌బిఐ వెల్లడించింది.

RBI slaps Rs 7 crore penalty on SBI