Thursday, April 25, 2024

ఆర్‌బిఎల్ కథ ముగియలేదు…

- Advertisement -
- Advertisement -

RBL Accountholders cheated at hands of cyber criminals

ఇంకా ఉంది… వందల్లో బాధితులు
క్రెడిట్ కార్డుల పేరుతో దోచుకున్న నిందితులు
వేటాడుతున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్ : క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య పెరుగుతుండడంతో సైబర్ నేరస్థుల కన్నువారిపై పడింది. బ్యాంక్‌లో పనిచేసే వారితో కలిసి ఖాతాదారులు వివరాలు తెలుసుకుని ఫోన్లు చేసి మోసం చేస్తున్నారు. ఆర్‌బిఎల్ బ్యాంక్ ఖాతాదారులకు ఫోన్లు చేసి వారి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా సైబర్ నేరస్థుల చేతుల్లో మోస పోయిన ఆర్‌బిఎల్ ఖాతాదారులు వందల్లో ఉన్నట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో సహా పలువురు నిందితులు పరారీలో ఉన్నారు. అలాగే ఈ ముఠా చేతిలో మోసపోయిన బాధితులు వందల్లో ఉన్నట్లు తెలిసింది. ఆర్‌బిఎల్ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తీసుకుని ఫోన్లు చేసి రూ.3కోట్లు దోచుకున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వందలాది మంది బాధితులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 34మంది ఫిర్యాదు చేయడంతో మిగతా వారు కూడా సైబరాబాద్ సైబర్ క్రైం ఆఫీస్‌లో ఫిర్యాదు చేస్తున్నారు.

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వివరాలు తీసుకున నిందితులు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని ఫోన్లు చేసి మోసం చేశారు. బాధితుల ఆధార్ కార్డు, పాన్‌నంబర్,పేరు తదితర వివరాలు చెప్పి కార్డు దారులను మోసం చేశారు. స్ఫూప్ కాల్స్‌తో నిందితులు మోసం చేస్తున్నారు, వాటిపై బ్యాంక్ అధికారుల పేర్లు రావడంతో బాధితులు నిజమేనని నమ్మి మొత్తం వివరాలు చెబుతున్నారు. వాటి ఆధారంగా నిందితులు వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులను దోచుకుంటున్నారు. దోచుకున్న డబ్బులను వివిధ బ్యాంక్ ఖాతాలు, మర్చంట్ వెబ్‌సైట్లకు తరలిస్తున్నారు. వాటిని ఈ వ్యాలెట్లు తదితర వాటి ద్వారా డ్రా చేస్తున్నారు.

పరారీలో ప్రధాన నిందితుడు….

నిందితులకు బ్యాంక్ ఖాతాదారుల వివరాలు ఇచ్చిన ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇద్దరు మాజీ బ్యాంక్ ఉద్యోగులు పట్టుబడగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకోగానే మిగతా వారు తప్పించుకున్నారు. డాటా ఇచ్చిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఢిల్లీకి పంపించారు.

రాని కార్డు యాక్టివేషన్….

క్రెడిట్ కార్డు యాక్టివేష్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డును బాధితులకు అందకుండానే ఎలా యాక్టివేషన్ చేసుకుంటారో తెలియడంలేదు. ఈ విషయం తెలిసి కూడా చాలామంది బాధితులు నకిలీ కాల్ సెంటర్ నిర్వహాకులు ఉచ్చులో పడిపోయారు. ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు తనకు అందిన తర్వాత మాత్రమే యాక్టివేషన్ చేయడం సాధ్యమవుతుంది. కాని కార్డు రాకముందే మీ కార్డు యాక్టివేట్ కావాలంటే ముందుగా తాము చెప్పినట్లు చేయాలని సైబర్ నేరస్థులు చెప్పడంతో బాధితులు నమ్మి అన్ని వివరాలు చెప్పారు. చివరికి ఓటిపి కూడా చెప్పడంతో లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు. ఇలా సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News