Thursday, April 25, 2024

కోహ్లి సేన సూపర్ గెలుపు

- Advertisement -
- Advertisement -

RCB won by super over eliminated against MI

దుబాయి : ఐపిఎల్‌లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఏడు పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఈ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. బెంగళూరుకు ఈ టోర్నీలో ఇది రెండో విజయం. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు అరోన్ ఫించ్, దేవ్‌దూత్ పడిక్కల్ బెంగళూరుకు శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన ఫించ్ 35 బంతుల్లోనే ఏడు ఫోర్లు, సిక్స్‌తో 52 పరుగులు చేశాడు. పడిక్కల్ రెండు సిక్స్‌లు, మరో ఐదు బౌండరీలతో 40 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. చివర్లో డివిలియర్స్, శివం దూబేలు విధ్వంసక బ్యాటింగ్ చెలరేగి పోయారు. అసాధారణ రీతిలో రాణించిన డిలియర్స్ 24 బంతుల్లోనే 4 భారీ సిక్స్‌లు, మరో నాలుగు ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మరోవైపు చెలరేగి ఆడిన దూబే పది బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 27 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పొలార్డ్ 24 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, మరో మూడు ఫోర్లతో అజేయంగా 60 పరుగులు చేశాడు. ఇక వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఇసాన్ కిషన్ 58 బంతుల్లో 9 సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు.

RCB won by super over eliminated against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News