Home ఛాంపియన్స్ ట్రోఫీ జి‘గేల్’.. విరాట్ విధ్వంసం..

జి‘గేల్’.. విరాట్ విధ్వంసం..

  • 21 పరుగుల తేడాతో ఘనవిజయం
  • లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ చిత్తు
  • అర్ధ శతకంతో ఆకట్టుకున్న విరాట్

ఐపిఎల్ 10 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో వరుస పరాజయలతో సతమతవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గేల్, విరాట్  కోహ్లిల విజృంభణతో రెండో విజయాన్ని సాధించింది. గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లుగా రాణించిన వీరద్దరూ చక్కని భాగస్వామ్యంతో బెంగళూరుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో 10వేల పరుగుల మైలురాయిని చేరిన గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్ విరాట్‌తో జోడీగా స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ లయన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 21 పరుగుల తేడాతో గుజరాత్ లయన్స్‌పై బెంగళూరు ఘనవిజయం సాధించింది. 

Gayle-Kohli

రాజ్‌కోట్ : ఐపిఎల్ 10 సీజన్‌లో రా యల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ పరుగుల సునామీ క్రిస్ గేల్ పరుగుల సునామీలా విధ్వంసం సృష్టించాడు. గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఈ మ్యా చ్‌లో అనూహ్యంగా అవకాశాన్ని ద క్కించుకున్న గేల్ అద్భుతమైన ప్రద ర్శన (38 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్) 77 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి చెలరేగిపోయాడు. గేల్‌కు జోడీగా కెప్టె న్ విరాట్ కోహ్లి (50 బంతుల్లో 7 ఫో ర్లు, 1 సిక్స్) 64 పరుగులు సాధించి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐపి ఎల్ 10 సీజన్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గుజరాత్ లయన్స్‌తో జరి గిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఘనవిజయం సాధిం చింది. 21 పరుగుల తేడాతో రైనాసేనను బెంగళూరు చిత్తు గా ఓడించింది. లక్ష ఛేదనలో లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో విజయంతో కోహ్లిసేనకు 2 పాయిం ట్లు దక్కాయి. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 భారీ స్కోరు సా ధించి ప్రత్యర్థి లయన్స్‌కు 214 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బెంగళూరు ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లి, గేల్ ఆది నుంచి నిలకడగా ఆడుతూ బెంగళూరుకు మంచి శుభారం భాన్ని అందించారు. ఇరువురి భాగస్వామ్యంలో 63 బంతు ల్లో తొలి వికెట్‌కు 100 పరుగులు సాధించగా, భాగస్వా మ్యంలో 99 పరుగులు జోడించారు. ఒక దశలో గేల్ దూకు డుకు బ్రేక్ పడింది. 12.4 ఓవర్‌లో బసిల్ థాంపి బౌలింగ్ లో ఎల్‌బిడబ్లుగా గేల్ వెనుదిరగగా, బెంగళూరు 159 స్కోరు వద్ద కోహ్లి కులకర్ణి బౌలింగ్‌లో డిఆర్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంత రం బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ (27), కేదార్ జాదవ్ (24) పరుగుల తో నాటౌట్‌గా నిలిచారు. లయన్స్ బౌలర్లలో కులకర్ణి, బసిల్‌కు తలో వికెట్ దక్కింది. గేల్‌కు అవార్డు
మెక్‌కలమ్ రాణించినా..
లక్ష ఛేదనలో గుజరాత్ లయన్స్ జ ట్టు ఓపెనర్ ఆటగాడు మెక్‌కలమ్ (44 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్) 72 పరు గులు చేసి హాఫ్ సెంచరీతో రాణించా డు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ గుజరాత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దితూ స్కోరుబోర్డును పరుగు లు పెట్టించాడు. 14.4 ఓవర్‌లో చాహల్ బౌలింగ్‌లో మిల్నెకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమిం చాడు. తొలుత ఓపెనర్లుగా వచ్చిన డిఆర్ స్మిత్ (1) పరుగుకే తొలి వికెట్ గా పెవిలియన్ చేరగా, కెప్టెన్ సురేశ్ రైనా (23) పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన ఫించ్ (7), దినేశ్ కార్తీక్ (1), రవీంద్ర జడేజా (23), ఇషాన్ కిషాన్ (39) పరుగులు చేయ గా, ఆండ్రూ టై (6), బసిల్ థంపి (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి లయన్స్ జట్టు 192 పరుగులు చేసిం ది. కాగా, బెంగళూరు బౌలర్లలో చాహల్ మూ డు వికెట్లు తీసుకోగా, నెగీ, అరవింద్, మిల్నే తలో వికెట్ తీసుకున్నారు.
10వేల పరుగులు చేసిన గేల్..
వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్, బెంగళూర్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ టి20 చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగో ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి 3 పరుగులు సాధించాడు. దీంతో ఇప్పటికే 9, 997 పరుగులు చేసిన అతడు తాజాగా జరిగిన మ్యాచ్‌లో మరో మూడు పరుగులు జోడించడంతో 10 వేల పరుగుల మైలురాయిని చేరాడు. ఈ నెల 14న ముంబయి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గేల్ కేవలం 22 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో పదివేల పరుగులకు మూడు పరుగుల దూరంలో నిలిచాడు. అయితే పుణె జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌కు తుదిజట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో షేన్ వాట్సన్‌ను జట్టులోకి తీసుకోవడంతో బ్రేక్ పడింది. మంగళవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో డివిలియర్స్ దూరమవ్వడంతో అతని స్థానంలో అనూహ్యంగా మళ్లీ గేల్ చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ ఐపిఎల్ కెరీర్‌లో గేల్‌కు 290వ టీ20 మ్యాచ్ కాగా, అంతకముందు జరిగిన మ్యాచ్‌తో అతడు 9, 997 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగులతో గేల్ 10వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.