Saturday, April 20, 2024

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య?

- Advertisement -
- Advertisement -
murder
రంగంలోకి దిగిన క్లూస్ టీం,  భూతగాదాలే హత్యకు కారణమా.?

కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి రాజరెడ్డి అలియాస్ బక్క రాజరెడ్డి(64) అనే వ్యక్తి కోరుట్లలోని బస్‌డిపో సమీపంలో ఉన్న ఆయన స్వగృహంలో మంగళవారం సాయంత్రం హత్యకు గురయ్యాడు. మృతుడు రాజరెడ్డి సుమారు గత పాతిక సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోరుట్లలో నివాసము ఉంటున్నాడు. ఆయన భార్య రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనసూయ 6ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. కుమారుడు సంజీవరెడ్డి కోరుట్లలోని మరో ఇంట్లో నివసిస్తుండగా, వివాహమైన కూతురు సోహిని హైదరాబాద్‌లో నివసిస్తున్నది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3గంటల సమయంలో కొందరు దుండగులు ఒంటరిగా నివసిస్తున్న రాజరెడ్డి ఇంటిలోకి ప్రవేశించి, తిరిగి వెళ్లారు.

అయితే ఆయన ఉంటున్న ఇళ్లు అమ్మకానికి పెట్టగా గత వారం రోజులుగా కొందరు ఆ ఇంటిని కొనుగోలు చేస్తామంటూ వచ్చి పోతున్నారు. అలాగే ఇంటి కోసం వచ్చిన వ్యక్తులుగానే స్థానికులు భావించారు. కాగా సాయంత్రం 4గంటల ప్రాంతంలో మృతుడు రాజరెడ్డికి నందం అనే మిత్రుడు ఫోన్ చేయగా అపరిచిత వ్యక్తి మాట్లాడి ‘ఇంటి అమ్మకం గురించి మాట్లాడుతూ రాజరెడ్డి బిజీగా ఉన్నాడ’ని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న మరో మిత్రుడు రత్నాకర్ ‘ఇంటి అమ్మకం గురించి ఒక్కడే మాట్లాడడం ఏంటి’ అని అనుమానం వచ్చి రాజరెడ్డి ఇంటికి వెళ్లి చూడగా, ఆయన పడక గదిలో మంచం పక్కన పడి ఉండడం గమనించాడు.

అప్పటికే రాజరెడ్డి చనిపోయి ఉండడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కోరుట్ల సిఐ రాజశేఖర్‌రాజు, ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి, కథలాపూర్ ఎస్‌ఐలు రాజప్రమీలతో పాటూ క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సంఘట స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే రెండేళ్ల క్రితమే సదరు రాజరెడ్డిని హత్య చేసేందుకు పథకం పన్ని కొందరికి ‘సుపారీ’ ఇచ్చిన విషయం స్థానికంగా ప్రచారంలో ఉంది. రాజరెడ్డి హత్యకు భూ తగదాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ రాజశేఖర్‌రాజు తెలిపారు.

real estate businessman murder in korutla jagtial district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News