Home తాజా వార్తలు లక్షలు విలువచేసే ప్రభుత్వ భూములు స్వాహ

లక్షలు విలువచేసే ప్రభుత్వ భూములు స్వాహ

Real estate traders in manuguru
మణుగూరు :మణుగూరు పట్టణంలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగడాలకు అంతులేకుండా పోతుంది.లక్షల రూపాయిలు విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమార్కులు స్వాహ చేస్తున్నారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించి,హద్దురాళ్లు పాతి ఆక్రమిచుకోని, ధర్జాగా ప్లాట్లుగా మార్చి గజాల సెంటుల లెక్క అమ్ముతూ లక్షలాది రుపాయిలతో జేబులు నింపుకుంటూ,మాజీ అటవీ శాఖ ఉద్యోగి తన దందాను కోనసాగిస్తున్నాడు. మణుగూరు మండలం సమితి సింగారం పంచాయితీలోని వాగు మల్లారం గ్రామంలో.సర్వేనెంబర్ 314 లో 4ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.దీనిపై కన్నేసిన మాజీ అటవీ శాఖ ఉద్యోగి సదరు భూమి తనదేనని ఎటువంటి ద్రృవ పత్రాలు లేకుండా,లక్షలు రూపాయిల విలవైన ప్రభుత్వ భూమిని యథేచ్చగా ప్లాట్లుచేసి అమ్మకాలు కొనసాగిసున్నాడు. దాదాపు 120 ప్లాట్ చేసి లక్షల్లో విక్రయిస్తున్నాడు. సెంట్ భూమి 68వేలనుండి లక్ష 20వేల రూపాయిలకు పైగా ధరతో విక్రయిస్తున్నాట్లు సమాచారం.ఆ ఉద్యోగి విక్రయించే భూములకు ఎటువంటి పట్టాలు కాని లేకుండా,పాత బాండ్ పేపర్లపై అమ్మకాలు సాగిస్తున్నాడు.

ఒక్కో ప్లాట్‌కు మ్యాప్‌ను సృష్టించి,పుట్ట గోడుగులుగా రియల్ ఎస్టేట్ లను నియమించుకోనివ వారికి అధిక కమీషన్ల్ అశాగా చూపి మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు,సింగరేణికార్మీకులు,వ్యాపరాస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు వీరిని ఏజెంట్ల్ టార్టేట్ చేసి విరితో ప్లాట్‌లను కోనిస్తున్నారు.మణుగూరు ఫారిశ్రామికంగా దుసుకుపోతున్నా క్రమంలో తము ప్లాట్లపై పేట్టిన సోమ్ము రెట్టిపవుతుందన్నా అశలతో ప్రజలు ప్లాట్లు కోనుకుంటున్నారు.పర్మిషన్ లేకుండా ప్రభుత్వ భూములను విక్రయించటం వల్ల ప్లాట్లు కోన్నవారికి భవిష్యత్త్‌లో నిర్మాణాలకు అనుమతులు లబించని పరిస్ధితి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపరి,మాజీ ఉద్యోగి మూలంగా ఏర్పాడింది.పట్టణంలో రియల్ వ్యాపరం పెరగటంతో పేద ,సామాన్యులు,ప్రజలు గుంట స్ధలం కోనలేని పరిస్ధితి నెలకోంది.ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను అక్రమించి ప్లాట్లుల విక్రయాల జరుపుతోన్నా, ఆక్రమార్కుల వేంటనే చర్యలు తీసుకోని ప్రభుత్వ భూములను కపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Real estate traders in manuguru