Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి రియల్‌మి 6ఐ

మార్కెట్లోకి రియల్‌మి 6ఐ

Realme 6i Phone launched in India

 

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి సరికొత్త రియల్‌మీ 6 ఐ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో మీడియా టెక్ హెలియో జి90టి ఉంది. 12 ఎన్‌ఎమ్ ప్రాసెస్‌ను ఉపయోగించి తయారు చేశారు. 6.5- అంగుళాల 90 హెర్ట్ అల్ట్రా స్మూత్ డిస్‌ప్లే కల్గిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4300 ఎంఎహెచ్ బ్యాటరీ కల్గిఉంది. బాక్స్‌లో 20డబ్లు ఛార్జర్‌తో వస్తుంది. రియల్ మీ 6ఐ రెండు వేరియంట్లలో లభిస్తుంది.- 4జిబి + 64జిబి రూ.12,999, 6జిబి + 64జిబి రూ.14,999గా నిర్ణయించింది. ఇది జూలై 31న రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్, రాయల్ క్లబ్‌లలో లభ్యం కానుంది.

Realme 6i Phone launched in India