Home టెక్ ట్రెండ్స్ సెలెక్ట్ మొబైల్స్‌లో రియల్‌మి 7 సిరీస్ ఫోన్లు

సెలెక్ట్ మొబైల్స్‌లో రియల్‌మి 7 సిరీస్ ఫోన్లు

Realme 7 Pro sale in India today via Flipkart

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబల్స్ స్టోర్స్‌లో రియల్‌మి 7 సిరీస్ మొబైల్స్‌ను విడుదల చేశారు. ఈ ఫోన్లను సంస్థ సిఎండి వై.గురు లాంచ్ చేశారు. రియల్‌మి 7, 7ప్రొ ఫోన్లను మొట్టమొదట సెలెక్ట్ స్టోర్లలో అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ ఫోన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాదు వినియోగదారులు సెలెక్ట్ మొబైల్స్ ఆన్‌లైన్ యాప్ ద్వారా కూడా ఈ మొబైళ్లను కొనుగోలు చేయవచ్చని గురు తెలిపారు.

రియల్‌మి 7 సిరీస్ ఫోన్ల ప్రత్యేకత మూడు నిమిషాల చార్జింజ్‌లో 3.5 గంటల కాల్స్, 2.5 గంటల ఎంటర్‌టైన్మెంట్, 13 గంటల మ్యూజిక్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చని అన్నారు. కేవలం 34 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుందని, ఇది 65డబ్లు సూపర్ డార్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుందని ఆయన వివరించారు. రియల్‌మి 7 ఫోన్ (6జిబి + 64జిబి) ధర రూ.16999, 8జిబి + 128జిబి ధర రూ.16999, రియల్‌మి 7ప్రో (6జిబి + 128జిబి) ధర రూ .19999, 8జిబి + 128జిబి ధర రూ.21999 ధరల్లో లభిస్తోంది.

Realme 7 Pro sale in India today via Flipkart