Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి రెండు కొత్త రియల్‌మి ఫోన్లు

మార్కెట్లోకి రెండు కొత్త రియల్‌మి ఫోన్లు

 

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మి సరికొత్త ఫోన్లు రియల్‌మి 8ఎస్ 5జి, రియల్‌మి 8ఐ లను మార్కెట్లోకి విడుదల చేసింది. దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ రెండు ఫోన్లతో పాటు మొట్టమొదటి టాబ్లెట్ ‘రియల్‌మి ప్యాడ్’ ను కూడా కంపెనీ విడుదల చేసింది. రియల్‌మి 8ఐ ప్రారంభ ధర 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ.13,999, అలాగే 6జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. రియల్‌మి 8ఎస్ ధర 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ.17,999గా ఉంది. ఈ ఫోన్ ఈనెల 14 నుంచి లభ్యం కానుంది. ఇక రియల్‌మి ప్యాడ్ 3జిబి ర్యామ్ + 32జిబి(వైఫై మోడల్) ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది సెప్టెంబర్ 16 నుంచి అందుబాటులోకి రానుంది.

Realme 8i and Realme 8s 5G were launched in India