Wednesday, April 24, 2024

రియల్‌మీ డిజో ఫీచర్ ఫోన్‌.. అతితక్కువ ధరకే

- Advertisement -
- Advertisement -

RealMe sub-brand Dizo launches first feature phone in India

 

న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ సబ్‌ బ్రాండ్‌ డిజో తొలి ఫీచర్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేర్లతో రిలీజైన ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 2,299, రూ.1,799కి అందుబాటులోకి వచ్చాయి. అలాగే బ్లాక్, గ్రీన్, సిల్వర్ రంగుల్లో ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి. ఆకర్షణీయంగా, క్లాసికల్‌గా కనిపించే ఈ బ్రాండెడ్ ఫోన్లు చాలా సహేతుకమైన ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటాయని సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.

డిజో స్టార్ 300 ఫీచర్లు…

  • 1.77-అంగుళాల స్క్రీన్‌
  • 2,550 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డేస్ స్టాండ్‌బై
  • 32 ఎంబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 64 జీబీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్
  • ఇంగ్లీష్, హిందీతో సహా తమిళం, గుజరాతీ, తెలుగు, పంజాబీ, బెంగాలీ, కన్నడ వంటి ప్రాంతీయ భాషలను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
  • ఇవే కాకుండా ఎఫ్ఎమ్ రేడియో, ఎమ్‌పీ 3 ప్లేయర్, గేమ్స్, క్యాలెండర్, అలారం, టాస్క్, కాలిక్యులేటర్ వంటి ఇతర ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

డిజో స్టార్ 500 ఫీచర్లు…

  • 2.8-అంగుళాల డిస్‌ప్లే
  • 1900 mAh బ్యాటరీ
  • ఈ ఫోన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, గుజరాతీ, తెలుగు భాషలకు సపోర్ట్ చేస్తుంది.
  • బ్లూటూత్, అలారం, సౌండ్ రికార్డర్, క్యాలెండర్, కాలిక్యులేటర్, ఎమ్‌పీ-3 ప్లేబ్యాక్, ఎఫ్ రేడియో, గేమ్స్, 0.3 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News