న్యూఢిల్లీ : సరికొత్త రియల్‌మి ఎక్స్7ప్రొ, రియల్‌మి ఎక్స్7 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు చిప్సెట్తో శక్తినిచ్చే భారతదేశ మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. దీనిలో 6.4 సూపర్ అమోలేడ్ స్క్రీన్, 64 ఎంపి ఎఐ ట్రిపుల్ కెమెరా సెటప్, 50డబ్లు సూపర్ డార్ట్ చార్జర్, 4310 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999 (6జిబి + 128జిబి), రూ. 21,999 (8జిబి + 128జిబి)గా ఉంది. ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12:00 నుండి రియల్.కామ్, ఫ్లిప్‌కార్ట్.కామ్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.