Home టెక్ ట్రెండ్స్ మార్కెట్లోకి రియల్‌మి ఎక్స్7 మాక్స్5 జి

మార్కెట్లోకి రియల్‌మి ఎక్స్7 మాక్స్5 జి

Realme X7 Max 5G with 120Hz display launched in india

 

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మి కొత్త ఫోన్ రియల్‌మి ఎక్స్7 మాక్స్5 జి మార్కెట్లోకి విడుదల చేసింది. 5జితో కూడిన స్మార్ట్ ఫోన్‌తో పాటుగా ఆల్‌రౌండ్ ప్యాకేజీగా 4కె సినిమా అనుభవంతో రియల్‌మి స్మార్ట్ టీవీ 4కెను కంపెనీ విడుదల చేసింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.26,999 (8జిబి + 128జిబి), రూ.29,999 (12జిబి + 256జిబి). జూన్ 4న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్ మి.కామ్‌లో అందుబాటులో ఉంటుంది. రియల్‌మి స్మార్ట్ టీవీ 4కె 43, 50లలో వరుసగా రూ. 27,999, రూ. 39,999 లకు లభిస్తుంది. ఇది జూన్ 04 మధ్యాహ్నం 12:00 నుండి రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్.కామ్‌లో అమ్మకానికి ఉంటుంది.

Realme X7 Max 5G with 120Hz display launched in india