Home తాజా వార్తలు రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రమాదం జరగలేదు…

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రమాదం జరగలేదు…

Rebel Star Krishnam Raju Was Mot Injuredహైదరాబాద్ : రెబల్ స్టార్ , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రం ఆయన ఇంట్లో పడిపోవడంతో కాలు విరిగినట్టు పుకార్లు వ్యాపించాయి. దీంతోనే ఆయన జూబ్లీహిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారని ప్రచారం జరిగింది. అయితే కృష్ణంరాజుకు ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలను ఆయన కార్యాలయ ప్రతినిధులు ఖండించారు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన అపోలోకు వెళ్లారని వారు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో సాయిధరమ్ తేజ్ ను కృష్ణంరాజు పరామర్శించారని, సాయి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతో చర్చించారని వారు వెల్లడించారు. త్వరలో లండన్ వెళ్లాల్సి ఉన్నందున రోటీన్ చెకప్ చేసుకోవడం కోసమే అపోలో ఆసుపత్రికి వెళ్లారని, ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వారు స్పష్టం చేశారు.