Wednesday, April 24, 2024

వాహన దారులపై రశీదుల భారం

- Advertisement -
- Advertisement -

Receipt Burden on Vehicle Lanes in Telangana

హైదరాబాద్: ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సామెత గుర్తుకు వస్తుంది. గరంలోని ఆర్టిఏ కార్యాలయాలను చూస్తుంటే. రవాణాశాఖలో ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికి కాని ప్రతిలావాదేవీకి సంబంధించి రశీదుల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 లక్షలకు పైగా బారం పుడుతోంది. వాహనా దారుల అవగాహన లేమి, అధికారులు తగు ప్రచారం కల్పించక పోవడంతో వినియోగ దారుల నెత్తిన అదనుపు భారం పడుతోంది. 2016 అగస్టు 6 ఉంచి రవాశాఖలో ఆన్‌లైన్ ససేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందుకు రవాణాశాఖతో ఈ మీ సేవా ఒప్పందం కూడా చేసుకుంది. అప్పటి నుంచి మ్యాన్యువల్‌గా ఎలాంటి చెల్లింపులు జరగలేదు. లర్నింగ్ లైసెన్స్, ట్రాన్స్‌షర్ ఆప్ ఓనర్‌షిప్, చిరునామా మార్పిడి, ఫిట్‌నెస్ ,ఆర్సి రెన్యువల్ ఈ విధగా 56 సేవలు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు.

ఇందుకు ప్రతి లావాదేవీకి కనీస చార్జి రూ.35 వసూలు చేయాలని నిర్ణయించిన ఫీజును సర్వీస్ చార్జితో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఆనైలైన్‌లో చెల్లింపుల అనంతరం మీ సేవా కేంద్రాల రశీదులు ఇస్తారు. కాని సంబంధిత ఫారం ప్రిట్ అవుట్‌ను వినియోగదారులే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న ప్రింట్‌టౌట్‌కు సంబంధిత రవాణా, ఇతర పత్రాలను జత చేసిన రవాశాఖ కౌంటరల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆసరగా చేసుకుని ప్రతి పింటౌట్‌కు నెట్ సెంటర్ల నిర్వహకులు రూ.20 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. తప్పని సరిగా ప్రింటౌట్ ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని మీ సేవా నిర్వహకుల చెబుతున్నారు. అనేక రోజులుగా మీ సేవా కేంద్రాల్లో ప్రింటౌట్ సమస్యల నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటిరెండు రవాణశాఖ కార్యాలయాల్లో మినాహ ఇతర మీ సేవా కేంద్రాలు మాత్రం ప్రింటౌట్లు ఇస్తున్నాయి.

దీంతో చేసేది ఏమీ లేక వినియోగదారులు బయట నుంచి రూ.20 నుంచి 30 వరకు చెల్లిస్తున్నారు. ఒక సారి సర్వీస్ చార్జి చెల్లించాక మరో సారిప్రింటౌట్‌కు డబ్బులు తీసుకోవడంతో వినియోగదారులుపై అదనపు బారం పుడుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 5 లక్షల పైగా భారం పడుతోందని తెలంగాణ సత్తిరడ్డి అంటున్రాను. ప్రభుత్వానికి రూ ః 35 సర్వీస్ చార్జి చెల్లించిన తర్వాత కూడా సంబంధిత కాగితాలను ప్రింట్ ఇచ్చేందుకు తిరిగి డబ్బులు చెల్లించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక నైనా నగరంలోని అన్ని మీ సేవా కేంద్రాల్లో సేవలకు సంబంధించి కాగితాల ప్రింట్‌లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అవగాహన లేకనే…. ఆర్టివో అధికారులు..

రవాణాశాఖలో వాహన దారులు సేవలకు సంబంధించిన తగిన రుసుం చెల్లించిన తర్వాత వినియోగ దారులు వాటికి సంబంధించిన ఫారాలు తీసుకోవచ్చని అధికారులు అర్టివో అధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు సందర్భల్లో సాంకేతిక సమస్యల కారణంగా సేవలకు సంబంధించిన ఫారాలు ప్రింట్ ఇవ్వడం సాధ్యం కాక పోవచ్చు. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత సంబంధించిన రశీదు నెంబర్ చెపితే సంబంధి త సేవలకు సంబంధించిన ఫారాలు పొందవచ్చని చెబుతున్నారు. కొంతి మంది వినియోగ దారులకు రవాణాశాఖ ఆన్‌లైన్ సేవలపై అవగాహన లేక పోవడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News