Home తాజా వార్తలు ఇల్లందు నుంచి రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా

ఇల్లందు నుంచి రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా

 

Coal Mine

మన తెలంగాణ /టేకులపల్లి: సింగరేణి కంపెనీ స్థాపించి 130 సంవత్సరాల చరిత్రలో గతంలో ఎన్నడు లేనంత రికార్డు స్థాయిలో ఉత్పత్తి, రవాణా చేయడం జరిగింది అని ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మినారాయణ తెలిపారు. ఆదివారం  స్థానిక సింగరేణి కాలనీ గెస్ట్‌హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. ఇల్లందు ఏరియా స్థాయిలో 59 లక్షల టన్నుల రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సంవత్సరంలో 63.41 లక్షల టన్నుల ఉత్పత్తిని, అలాగే 75.99 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందన్నారు. మొత్తం సింగరేణి సంస్థ ఏరియాలలోనే ఉత్పతిలో రెండో స్థానంలో, బొగ్గు రవాణాలో మొదటి స్థానంలో సరికొత్త రికార్డులను నెలకొల్పడంపై హర్షం వ్యక్తం చేశారు.

జెకెఒసి నందు ఈ సంవత్సరంలో 28 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 32.99 లక్షల టన్నుల ఉత్పత్తి చేశామని, 33.24 లక్షల టన్నుల రవాణా చేయడం జరిగిందన్నారు. 36.67 టన్నుల రికార్డు ఉత్పాదకత సాధించడం జరిగింది. అలాగే కెఒసి నందు 30లక్షల టన్నుల ఉత్పత్తికి గాను నూరు శాతం ఉత్పతి 34.72 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగింది. ఇది రికార్డులలో రెండవ అధిక స్థానం ఇంతే కాకుండా నెలవారి అత్యధిక రికార్డు రవాణా 4.01 లక్షల టన్నులు ఫిబ్రవరి 19 తారీఖున నమోదు కావడం జరిగింది అని కొనియాడారు. దీనికి సహకరించిన అధికారులకు, కార్మికులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జెఒసి పిఓ వేణుగోపాల్‌రెడ్డి, డిజియం జానకిరాం, శ్రీనివాసు, పర్సనల్ మేనేజర్ చందల లక్ష్మినారయణ, గిరిధరరావు, మేనేజర్ వి. క్రిష్ణయ్య, ధనుంజయరెడ్డి, తారియనాయక్, విశ్రాంత్, సత్యనారాయణపాసి తదితరులు పాల్గొన్నారు.

 

Record Create in Coal Mine Products in Bhadradri