Home తాజా వార్తలు స్పెషల్ డిఎస్‌సి నిర్వహించే ఆలోచన ఉంది: కడియం

స్పెషల్ డిఎస్‌సి నిర్వహించే ఆలోచన ఉంది: కడియం

                        KADIYAM

హైదరాబాద్: విద్యాశాఖలో వెనుకబడ్డ జిల్లాల్లో ఎక్కువ ఖాళీలున్నాయని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ…. అవసరమైతే ఉర్తూ మీడియానికి ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్‌పి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా తీసుకుంటామన్నారు. టిఆర్‌టి ప్రక్రియ పూర్తియిన తరువాత స్పెషల్ డిఎస్‌సి నిర్వహించే ఆలోచన ఉందని వెల్లడించారు. డిఇడి అభ్యర్థులకే ఎస్‌జిటి అవకాశం ఉందని, ఇప్పటి వరకు 11,428 విద్యావాలంటీర్లను తీసుకున్నామని చెప్పారు. పేద విద్యార్థులందరికి నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ధ్వేయమన్నారు. మూడేళ్లలో 544 గురుకులాలను స్థాపించామన్నారు. వచ్చే సంవత్సరంలో ఎనిమిది వేల గురుకుల టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన విద్యా సంస్థలకు కనీసం భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.