Wednesday, March 22, 2023

వరంగల్‌లో జరిగే రెడ్ల శంఖారావానికి తరలిన రెడ్డిలు

- Advertisement -

bus

మన తెలంగాణ / తిమ్మాపూర్ : రెడ్డి ఐక్య వేదిక ఆద్వర్యంలో వరంగల్ లో జరిగే కాకతీయ రెడ్డి శంఖారావం బహిరంగ సభకు మండలంలోని పలు గ్రామాల రెడ్డి సంఘం నాయకులు ఆదివారం పెద్ద సంఖ్యలో బస్సుల్లో బయలు దేరి వెళ్లారు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలం అయిందని వారు ఆరోపించారు. చట్టబద్దతతో కూడిన వెయ్యి కోట్ల ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, కేజీ టూ పిజీ వరకు జిల్లా కొక కొత్త గురుకులం ఏర్పాటు తో పాటు విద్యా ఉద్యోగాల్లో వయోపరిమితి సడలించి , 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ లతో పాటు మరిన్ని డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరారు. వరంగల్ కు  వెళ్లిన వారిలో మహాత్మనగర్ , తిమ్మాపూర్ కు చెందిన తక్కిటి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల జోగిరెడ్డి, కేతి రెడ్డి అంజిరెడ్డి, ఎల్లారెడ్డి, గంకిడి లకా్ష్మరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ముడుపు శ్రీనివాస్ రెడ్డి, కేతిరెడ్డి దేవెందర్ రెడ్డి, సంగంపల్లి జితేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News