Home తాజా వార్తలు పేలిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్…

పేలిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్…

Xiaomi-Redmi-Note-7S

ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 7 ఎస్ స్మార్ట్‌ఫోన్ పేలింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఫోన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. వివరాల్లోకి వెళితే… ముంబైలో నివాసి అయిన ఈశ్వర్ చౌహాన్ గత అక్టోబర్ నెలలో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను కొన్నాడు. అయితే నవంబర్ 2వ తేదీన ఇంట్లో టేబుల్ మీద ఉంచిన‌ ఆ ఫోన్ దానంతట అదే అకస్మాత్తుగా పేలింది. ఈ క్రమంలో చౌహాన్ షియోమీ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. ఆ ఫోన్‌ను పరిశీలించి సిబ్బంది కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలిందని చెప్పారు. తాను ఫోన్‌ను టేబుల్ మీద పెట్టిన ఫోన్లో నుంచి అకస్మాత్తుగా కాలిపోయిన వాసన వచ్చిందని, ఆ తరువాత పేలిందని ఈశ్వర్ చౌహాన్ అంటున్నాడు. షియోమీ అతని వాదనను పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే గతంలో ఇలాంటి స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.

Redmi Note 7s Smartphone Exploded At Mumbai