Home వనపర్తి రైల్వేలో ఊపందుకున్న ఈ టిక్కెట్

రైల్వేలో ఊపందుకున్న ఈ టిక్కెట్

Reduced reception for ticket counters

ఆన్‌లైన్‌కు ఆదాయం బదిలీ
టిక్కెట్ కౌంటర్లకు తగ్గిన ఆదరణ
అదుపులోకి రాని తత్కాల్ అక్రమాలు

మన తెలంగాణ/వనపర్తి : రైలు టిక్కెట్ల జారీలో అక్రమాలను అరికట్టడానికి, ప్రయాణీకుల కు టిక్కెట్లు కొనుగోలు సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన రైల్వే ఈ- టికెట్ విధానం వేగం పుంజు కుంటోంది. ఈ విధానం వల్ల రైల్వే స్టేషన్లలోని కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం పిఆర్‌సి కౌంటర్ల వద్ద రద్దీ తగ్గిపోతుంది. రైల్వేకు భారం తగ్గుతుంది. ప్రయాణీకులు టికెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలిచి సమయాన్ని వృథా చేసుకోకుండా ఆన్‌లైన్ టికెట్ విధానానికి అలవాటుపడుతున్నారు. తద్వారా ఈ టికెటింగ్‌కు ఆదరణ పెరుగుతుండగా, రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్‌కు జనం తగ్గిపోతున్నారు. ఈ కారణంగా ఉదయం 10 గంటలైతే రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కేంద్రాల వద్ద దర్శనమిచ్చే క్యూ ఇప్పుడు కనిపించడం లేదు.ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సమస్యలను అధిగమిం చ డంతో పాటు, కాన్సిలేషన్‌కు కూడా రైల్వే స్టేషన్‌కు వెళ్లే అవ సరం లేకపోవడంతో రైల్వే రైల్వేలో ఊపందుకున్న ఈ టిక్కెట్ స్టేషన్ల లోని పిఆర్‌ఎస్ కేంద్రాల వద్ద ప్రయాణీకుల రద్దీ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఆన్‌లైన్ టికెట్ విధానానికి పిఆర్‌ఎస్ ఆదాయాలను, ప్రయాణీకుల సంఖ్య పర్సెంటేజీని పరిశీలిస్తే రద్దీ తగ్గిందని అర్థమవుతుంది. గత సంవత్సరం ఏప్రిల్ 1 నుండి జూన్ 30 వరకు అమ్ముడైన మొ త్తం ప్యాసింజర్ల టికెట్ సంఖ్యలో పిఆర్‌ఎస్ కౌంటర్ల షేర్ 63 శాతం ఉండ గా, ఈ టికెట్ షేర్ 36 శాతం ఉంది. ఈ సంవత్సరం ఈ మూడు నెలల్లో పిఆర్‌ఎస్ కౌంటర్లలో ప్యాసింజర్ల సంఖ్యలో 62 శాతం. ఈ టికెటింగ్‌లో 37 శాతంగా ఉంది. ఆదాయాల గణాంకాలను పరిశీలిస్తేగత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టరుకు మొత్తం టిక్కెట్ల ఆదాయంలో పిఆర్‌ఎస్ కౌంటర్ల ఆదా యం 62 శాతం ఉండగా, ఈ టిక్కెట్లకు 37 శాతం షేర్ అయింది. అదే కాలానికి ఈ సంవత్సరం రైల్వే కౌంటర్ల నుండి 61 శాతం షేర్ రాగా, ఈ టిక్కెట్ల ద్వారా 38 శాతం షేర్ సమకూరింది. ఈ గణాంకాల వల్ల టిక్కెట్లకు ఆదరణ పెరిగిందని తెలుస్తుంది.

ఈ టికెట్‌కే ఓటు
రైల్వేశాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం పిఆర్‌సి టికెట్ల కేంద్రాల వద్ద ఏర్పడే రద్దీని నియంత్రించడానికి ,టికెట్ల జారీలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టడానికి ఆన్‌లైన్ ఈ టికెట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే అన్‌రిజర్వుడు జనరల్ టిక్కెట్ల జారీకి రైల్వే స్టేషన్లలో థర్డ్ పార్టీ ఆపరేటింగ్ టిక్కెట్ వెండింగ్ యంత్రాలను, పాయింట్ ఆఫ్ సేల్ (పిఒఎస్) మిషన్లను వ్యవస్థాపించింది. తాజాగా జనరల్ టిక్కెట్ల జారీకి కూడా ప్రత్యేక సెల్‌ఫోన్ యాప్‌ను కిందటి నెలలో ప్రవేశ పెట్టింది. ఇప్పటి దాకా కేవలం రిజర్వేషన్ టిక్కెట్లనే ఆన్‌లైన్‌లో ఇస్తుండగా జనరల్ టిక్కెట్లను కూడా సెల్ ఫోన్ ద్వారా ప్రయాణికుడు కొనే విధంగా అన్‌రిజర్వుడు టిక్కెట్ సర్వీస్‌యుటిఎస్ యాప్‌ను తెరపైకి తెచ్చింది. రైలులో నింపాదిగా కూర్చొని ఈ యాప్ ద్వారా ఎంచక్కా టిక్కెట్టును పర్చేజ్ చేసేయవచ్చు. జనరల్ టిక్కెట్‌ను కొనడం సులభతరం చేయడంతోపాటు, టిక్కెట్ లెస్ ప్రయాణాలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. రైలు కదులుతున్నందున టిక్కెట్టు కొనే సమయం లేక రైలెక్కాలన్నాకారణం ప్రయాణీకులు చెప్పకుండా, రైలులో కూర్చొని బేఫికర్‌గా టిక్కెట్టును కొనే వీలును ఈ యాప్ కల్పిస్తుంది.

ఆన్‌లైన్‌కు ఆదాయం బదిలీ
ఈ టికెటింగ్ విధానం వల్ల రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పిఆర్‌ఎస్ కేంద్రాలకు ఆదరణ తగ్గుతుండగా, తద్వారా వచ్చే ఆదాయం కూడా ఆన్‌లైన్ టిక్కెట్ సర్వీస్‌కు బదిలీ అవుతుంది. అంటే రైల్వే స్టేషన్‌లో ఉన్న కంప్యూటరైజ్డ్ బుకిం గ్ సెంటర్లకు వచ్చే ఆదాయం రోజు రోజుకు తగ్గిపోతుండగా అది కాస్తా ఆన్‌లైన్ టికెట్ విధానానికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ వార్షిక సంవత్సరం మొద టి క్వార్టర్ ఎప్రిల్,మే. జూన్ నెలలకు టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయానికి కిందటి సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఆదాయానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే ఆ విషయం ధృవపడుతుంది. రైల్వే డివిజన్‌లో కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 17 శాతం ఆదాయం, 14 శాతం ప్రయాణీకుల సంఖ్య ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి పెరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ 1 నుండి జూన్ 30 వరకు 1409 లక్షల మంది ప్రయాణీకులు రిజర్వేషన్‌కు ఈ టికెట్‌ను కొనగా ఈ సంవత్సరం అదే కాలానికి 17 లక్షల మంది ప్రయాణీకుకలు ఆన్‌లైన్ టిక్కెట్లు కొన్నారు. అంటే ఈ మూడు నెలల్లో దాదాపు 2 లక్షల మంది ప్రయాణీకులు గత గణాంకాలతో పోలిస్తే దాదాపు 14 శాతం టిక్కెట్ల కొనుగోళ్ల కోసం రైల్వే స్టేషన్‌కు రాకుండా ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ టికెట్‌ట్‌ల ద్వారా రైల్వే డివిజన్ కు గత సంవత్సరం ఫస్ట్ క్వార్టర్‌కు రూ. 78కోట్ల ఆదాయం రాగా ఈ సంవత్సరం క్వార్టర్‌కు సంవత్సరానికి రూ. 13 కోట్లు ఆదాయం చేకూరింది. దీన్ని బట్టి రూ. 13 కోట్ల గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 17 శాతం ఆదాయం ఆన్‌లైన్‌కు పెరిగింది.

కొనసాగుతున్న తత్కాల్ అక్రమాలు
రైల్వే శాఖ ఇన్ని కసరత్తులు చేస్తున్నా తత్కాల్ టిక్కెట్ల అక్రమాలను మాత్రం అదుపుచేయలేకపోతుంది. ఐఆర్‌సిటిసి ఇతర ప్రైవేట్ టిక్కెట్ల జారీ సంస్థలు అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు రైల్వే శాఖ కొన్ని చర్యలు చేపట్టిం ది. రోజు ఉదయం 10 గంటలకు ఎసి తత్కాల్ టిక్కెట్లు 11 గంటలకు స్లీపర్ క్లాస్ తత్కాల్ టిక్కెట్లను పిఆర్‌ఎస్ కేంద్రాల్లో అమ్ముతోంది. రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ల జారీ ప్రారంభమైన అర గంట తర్వాత ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. కాని మధ్యవర్తులు రైల్వే స్టేషన్ల లోని పిఆర్‌ఎస్ కేంద్రాలను లక్షంగా చేసుకొని బుకింగ్ కార్యాలయం ఉద్యోగులకు ఎరవేసి టిక్కెట్‌లను పొందుతున్నారు. ఉదయం కౌంటర్లు తెరచుకోక ముందే బుకింగ్ క్లర్కులకు టికెట్ పర్చేజ్ అప్లికేషన్‌లను అందజేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆన్‌లైన్ టిక్కెట్ల జారీకి అరగంటే సమయం ఉండడంతో క్యూలో నిలిచిన వారికి ఒక టికెట్ ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా తొలి అరగంటలో ఇద్దరు , ముగ్గురికి మినహహా ఎక్కువ మందికి టిక్కె ట్లు ఇవ్వడం లేదని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా టిక్కెట్లు కౌంటర్లకు వెళ్లినా ప్రయోజనం ఉండదని భావించి వెళ్లడం లేదని తెలుస్తుంది.