Friday, April 19, 2024

ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?

- Advertisement -
- Advertisement -

school-bags

 విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం
అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు
అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు
అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు

హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు కిలోల కొద్ది పుస్తకాలు మోస్తూ అనారోగ్యానికి గురవుతున్నారని గ్రహించిన ప్రభుత్వం ప్రక్షాళన చర్య లు చేపట్టింది. బ్యాగు బరువును తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసి ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ కూడా బరువు తగ్గిన దాఖలాలు కన్పించడం లేదు. బం డెడు పుస్తకాల బరువుతో నడుం వంగిపోతున్న బాల్యానికి ఊరటనివ్వాలని ఆదేశాలు జారీ చేస్తే ప్రైవేటు పాఠశాలలు భేతరు చేయడంలేదు. చాలావరకు పుస్తక ముద్ర ణ సంస్థలు ఇచ్చే కమీషన్‌ల కోసం అవసరం లేకున్నా భారీస్థాయిలో పుస్తకాలు కొనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎల్‌కెజి చిన్నారికే 10 నుంచి -15 పుస్తకాలు అంటగడుతున్నారంటే పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. పుస్తకాలతోపాటు బ్యాగు, లంచ్ బాక్సు, వాటర్ బాటిల్ కలిపి మొత్తం 7 నుంచి 8 కిలోల భారం ఒక ఎల్‌కెజి విద్యార్థిపై పడుతుంది. వాస్తవానికి ఈ స్థాయి పిల్లలు అసలు సంచే మోయకూడదు. విద్యార్థుల బ్యాగుల భారం తగ్గించేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేసినా అమలుకు నోచడం లేదు. బ్యాగు బరువు ఎంత ఉండాలో నిర్దేశించిన ఆదేశాలు కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు కావడం లేదు. విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకటి, రెండు తరగతులకు 1.5 కిలోల కంటే ఎక్కువు ఉండకూడదు. మూడు నుంచి ఐదవ తరగతి వరకు రెండు నుంచి మూడు కిలోలు ఉండాలి.

ఆరు, ఏడు తరగతులకు నాలుగు కిలోల బరువు ఉండాలి. ఇక ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు 4.5 కిలోలు ఉం డాలి. పదవ తరగతి విద్యార్థులకు ఐదు కిలోలు మించకూడదని 2017, జులై 18న జి.ఒ. నెంబర్ 22ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఆదేశాలు ఎక్కడా అమ లు కావడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు పిల్లలు కిలోల కొద్ది బరువులు మోస్తున్నారు. అక్షరజ్ఞానం కోసం వచ్చే విద్యార్థులను ఆసుపత్రుల పాలు చేయకుండా చూడాలని విద్యార్థుల తల్లి దండ్రులు ఎన్నిమార్లు వేడుకుంటున్నా చలనం లేకుండా పోయింది.

పసి మొగ్గలపై కిలోల కొద్ది భారం

చిన్నారి విద్యార్థులకు కిలోల చొప్పున ఉండడంతో వారు అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నట్లు సర్వేలలో కూడా తేలింది. ప్రభుత్వ పాఠశాలలను మినహాయిస్తే ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు బ్యాగులు భారంగా మారుతున్నాయి. కార్పోరేట్ హంగులతో కిలోలకొద్ది భారాన్ని విద్యార్థులు మోస్తున్నారు. నర్సరీ, ఎల్‌కెజి,యుకెజి చదివే చిన్నారి విద్యార్థులకు కిలోల బరువు ఉండే పుస్తకాలను బ్యాగులలో ఉంచి పుస్తకాల భారాన్ని మోపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు స్టేట్ సిలబస్, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ పుస్తకాలను వినియోగిస్తున్నారు. వీటితోపాటు టెక్నో, ఇ టెక్నో, ఇంటర్నేషనల్, డిజిటల్ తరగతుల పేరుతో సొంత కరికులమ్ రూపొందించి విద్యార్థులకు అందజేస్తున్నాయి. పాఠ్యపుస్తకాలకు అదనంగా నోట్‌పుస్తకాలు, స్టడీ మెటీరియల్, వర్క్‌బుక్, గైడ్‌లు ఇలా పలు రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేస్తున్నా యి. వయసుకు మించిన బ్యాగు బరువుతో విద్యార్థులు నిత్యం సతమతమవుతూ అనారోగ్యం పాలవుతున్నారు.

భారమంతా వెన్నుముకపైనే

నిటారుగా నిలబడాలంటే వెన్నుముకే ఆధారం. ఇది 33 వెన్నుపూసల ఎముక గూడు, కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఒకదానికి మరొకటి నిలువుగా పేర్చబడి ఉంటాయి. వెన్నుముక మొండెంకు స్థిరత్వాన్ని కదిలే గుణాన్ని ఇస్తూ అక్కడ ఉండే సున్నితమైన నరాలను కాపాడుతుంది. మెడ, ఛాతి భాగాలు దీని ఆధారంగానే పని చేస్తాయి. ఇంత విలువైన అవయంపై అదనపు భారం పడడంవల్ల క్రమంగా వెన్నుపూసలు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెన్నుపూస సమస్యలు ఎక్కువుగా పదవ తరగతిలోపు వారికే వస్తున్నాయి. 15 ఏళ్లలోపు వారి శరీరంలో వివిధ రకాల మార్పులు జరుగుతాయి. ఈ వయసులో తమ బరువుకుమించి భారం పడితే తీవ్రమైన వెన్ను, మెడ నొప్పులకు దారితీస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల్లో ఒకవైపు భుజం ఎక్కువ, మరోవైపు తక్కువుగా ఉంటే తక్షణం వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Reduced weight of school bags for students

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News