Saturday, April 20, 2024

ఇనుప చువ్వల మధ్య బంధీగా రెజీనా.. ‘నేనే నా?’

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ రెజీనా కసండ్ర ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘నేనే నా?’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ మంగళవారం విడుదల చేశారు. ఇనుప చువ్వల మధ్య బంధీగా ఉన్న మహారాణి పాత్రలో రెజీనా లుక్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ “మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘నేనే నా?’ సినిమాను కార్తీక్ రాజు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. వరుణ్‌తేజ్ విడుదల చేసిన రెజీనా లుక్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాలజిస్ట్‌గా కనపడతారు. నటిగా ఆమెను మరో యాంగిల్‌లో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు”అని అన్నారు.

Regina’s ‘Nenena?’ first look released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News