Home వరంగల్ రూరల్ అభివృద్ధికి నోచుకోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల

అభివృద్ధికి నోచుకోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల

eye

*150 పడకల స్థాయిపై నెరవేరని సిఎం హామీ
*సిబ్బంది కొరతతో సతమతం
*అసౌకర్యాల నడుమ ప్రాంతీయ కంటి దవాఖాన

మన తెలంగాణ/ఎంజిఎం: తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా పేరు పొందిన వ రంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఈ కంటి దవాఖాన పాలకుల చిన్నచూపునకు గురవుతుంది. ఎందరికో చూపును అందిస్తున్న ఈ ఆస్పత్రి అనేక సమస్యలతో కూనారిల్లుతుంది. ఉమ్మడి వరంగల్‌తో పాటు ఐదు జిల్లాల పరిధి కలిగిన ఈ నేత్ర వైద్య శాలకు రోజుకు 400 నుంచి 450 మందికిపైగా రోగులు వస్తుంటారు. రోజుకు 35 నుంచి 45 మంది రోగులు చేరిక అవుతారు. ఏటా 80 వేల మంది తాకిడితో పాటు నేత్రాల సేకరణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఈ ప్రాం తీయ నేత్ర వైద్యశాలలో వైద్యులు, పారామెడికల్, సిబ్బంది కొరత ప్రాతిపదిక సౌకర్యాలు లేకపోవడం వల్ల రోగులకు పూర్తిస్థాయిలో సరైన వైద్యం అందడం లేదు.
30 ఏళ్లు అవుతున్నప్పటికి.. అభివృద్ధికి నోచుకోని వైనం..
ఈ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఏ ర్పాటై 30 సంవత్సరాలు అ యినప్పటికీ అభివృద్ధికి మా త్రం నోచుకోలేకపోతుంది. 1990లో వరంగల్‌తో పా టు ఏర్పాటైన కర్నూలు, విశాఖపట్టణం ప్రాంతీయ నేత్ర వైద్యశాలను సూపర్‌స్పెషాలిటి ఆస్పత్రులుగా అ భివృద్ధి చెందగా ఇక్కడ ఆ స్పత్రి మాత్రం అభివృద్ధికి ముం దుకు కదలడం లేదు. ఆస్పత్రి పడకల స్థాయిని 150కి పెంచి సూపర్ స్పెషాలిటిగా తీర్చుదిద్దుతామన్న తెలంగాణ ము ఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కెసిఆర్ ఇ చ్చిన హామీ అనంతరం ఆస్పత్రి అధికారు లు ప్రతిపాదనలు పంపారు.  ఇప్పటికీ వీటికి మోక్షం లేదు.
సిబ్బంది కొరత.. ఆస్పత్రిలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికి ఆస్పత్రి సిబ్బంది కొరత ఉండడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఈ కంటి దావఖానలో మంజూరైన పోస్టులు 83 గాను, ప్రస్తుతం 66 మందే ఉన్నారు. 17 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కీలకమైన నాలుగు ప్రొఫెసర్లకు గాను రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జరీ, 20 హెడ్‌నర్సెస్, 12 ఎన్‌ఎన్‌ఒ తదితర పోస్టులు అవసరమని ఆస్పత్రి వర్గాలు తెలుపుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టు, హెల్త్ విజిటర్ల పోస్లులు రెండు ఖాళీగా ఉన్నాయి. రిప్రాక్షనిస్టులు అసలు లేనే లేరు. ఆర్టోమెట్రిస్ట్ ఈ పోస్టు ఇప్పటికీ భర్తీ కాలేదు. రిహబలిటిషన్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ప్లంబర్, డ్రైవర్, కార్పెంటర్, స్లీపర్స్, క్లీనర్స్ చాలా కాలంగా నిలపకుండా అలాగే ఉన్నాయి. నిత్యం రోగుల తాకిడితో కిటకిటలాడుతున్న ఈ ఆస్పత్రిలో రోగుల ఒపి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికి ఆస్పత్రి ఉ న్నా వైద్య సేవలు ప్రస్తుతం మెరుగ్గా ఉన్నప్పటికి వసతుల సమస్యతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
అరకొర వసతులు.. ఈ ఆస్పత్రిలో పూర్తి సౌకర్యాలు లేవు. వైద్య సిబ్బంది కొరతతో పాటు వైద్య పరికరాలు, మందులు, నిధుల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రిలో నాలుగు యూనిట్లు ఉన్నా వీటికి సరిపడా డాక్టర్లు లేరు. ఆస్పత్రుల్లో 75 పడకల సామర్థం మించి వంద నుంచి 125 మందికి పైగా రోగులను చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. గ్లకోమా, రెటీనా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినా, స్వరాష్ట్రం సిద్ధించినా ఆస్పత్రి పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా ఈ కంటి దావఖానను అత్యాధునిక టెక్నాలజీతో ప్రైవేటు కార్పొరేటు కంటి ఆస్పత్రులకు ధీటుగా ఈ ఆస్పత్రిని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.