Home తాజా వార్తలు పంచాయతీరాజ్‌లో.. పదోన్నతులు షురూ

పంచాయతీరాజ్‌లో.. పదోన్నతులు షురూ

MPDOs

 

కొత్త మండలాలకు త్వరలోనే రెగ్యులర్ ఎంపిడిఓలు
సీనియార్టీలకు అధిక ప్రాధాన్యత

నిర్మల్ : నిర్మల్ జిల్లా ఏర్పడిన తరువాత కొత్తగా ఐదు మండలాలను ఏర్పాటు చేశారు. పెంబి,దస్తురాబాద్,సోన్, నర్సాపూర్(జి),బాసరలను నూతన మండలాలుగా ప్రకటించారు. అయితే ఈ మండలాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకముందు పాత మండలాల ఎంపిడిఓలే ఇన్‌చార్టీలుగా వ్యవహరించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయి మండల పరిషత్, గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడ్డాయి. అయితే పిఆర్‌టిలో పదోన్నతుల సందడి షురూ అయింది. కొత్త మండలాలకు రెగ్యూలర్ ఎంపిడిఓలను పదోన్నతులు రానున్నాయి. రాష్ట్ర స్థాయి నుండి ఆదేశాలు రావడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ఇందులో భాగంగానే ఈఓపిఆర్‌డి సూపరిండెంట్లకు ఎంపిడిఓలు పదోన్నతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. పదోన్నతులకు సంబంధించిన వివరాలను పంచాయతీరాజ్‌శాఖ అధికారులు జిల్లా అధివకారులకు పంపించారు.కొత్త మండలాలకు పాత మండలాల్లోని సూపరింటెండెట్లను,ఈఓపిఆర్‌డిలను ఇన్‌చార్జీ ఎంపిడిఓలుగా నియమించారు. ఇప్పటికీ వారు కొనసాగుతున్నారు. అయితే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అవుతే పాత మండలాల రెగ్యూలర్ అధికారులు నియామకం కానున్నారు.పాత మండలాల్లో అడహక్ కడెం, కుభీర్ మండలాలకు కొనసాగుతున్నారు. ఎంపిడిఓలుగా పదోన్నతులు లభించనున్నాయి.

ఈఓపిఆర్‌డిలకు డిఎల్‌పిఓలుగా పదోన్నతులు లభించ అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. సీనియర్ అసిస్టెంట్లు,రికార్డు అసిస్టెంట్లు, గ్రేడ్ 1,పంచాయతీ కార్యదర్శులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఇలా అందరికీ పదోన్నతులు లభించనున్నాయి. ఎంపిడిఓలుగా పదోన్నతులు పొందే వారికే ప్రస్తుతం తాము పని చేస్తున్న జిల్లాలో వారికి ప్రస్తుతం తాము పని చేస్తున్న జిల్లాలో పోస్టులు ఖాళీ ఉంటే ఇక్కడే లేకుంటే మల్లీజోనల్ పోస్లు అయినటువంటి ఎంపిడిఓ పోస్టును మరో జిల్లాలో పొందాల్సి ఉంటుంది.

Regular MPDOs soon for new zones