Wednesday, April 24, 2024

‘నిట్’ ప్రవేశాలకు నిబంధనల్లో సడలింపు

- Advertisement -
- Advertisement -

Regulations Relaxation for NIT Entrance 2020

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కారణంగా ఎన్‌ఐటిలు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు అర్హతా ప్రమాణాలను సడలించినట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశానికి 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు రావాలనే నిబంధనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్టా ఎన్‌ఐటిలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు అర్హతా ప్రమాణాలను సడలించాలని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సిఎస్‌ఎబి) నిర్ణయించింది’ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఓ ట్వీట్‌లో తెలియజేశారు. ఎన్‌ఐటిలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఇప్పటివరకు జెఇఇ మెయిన్‌లో అర్హత సాధించడంతో పాటుగా12వ తరగతి బోరు పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు కానీ వాటి అర్హతా పరీక్షల్లో టాప్ 20పర్సెంట్ సాధించిన వారిలో ఒకరుగా కానీ ఉండాలి. కాగా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జెఇఇమెయిన్స్ పరీక్షలను ఇంతకు ముందు ప్రకటించినట్లుగా సెప్టెంబర్ 16 తేదీల మధ్యజరగనుంది.

Regulations Relaxation for NIT Entrance 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News