Home జాతీయ వార్తలు జమ్మూపూంచ్ రహదారిని దిగ్బంధించిన సిఆర్‌పిఎఫ్ జవాన్ బంధువులు

జమ్మూపూంచ్ రహదారిని దిగ్బంధించిన సిఆర్‌పిఎఫ్ జవాన్ బంధువులు

Relatives of jawan abducted in jammu-poonch road

 

క్షేమంగా విడుదల చేయించాలని డిమాండ్

జమ్ము: చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్లకు బందీగా చిక్కిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్ బంధువులు బుధవారం నిరసన చేపట్టారు. సింగ్ స్వస్థలం బర్నాయ్‌లో జమ్మూపూంచ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాకేశ్వర్‌సింగ్ భార్య మీనూ సహా పదుల సంఖ్యలో వారి బంధువులు ఆందోళనలో పాల్గొన్నారు. సింగ్‌ను సురక్షితంగా తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మీనూ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఆమె ప్రశ్నించారు. సెలవు తర్వాత డ్యూటీకి ఒక్కరోజు ఆలస్యమైనా చర్య తీసుకుంటారు.

శనివారం నుంచి కనిపించకుండా పోయినా ఎవరూ స్పందించడం లేదెందుకని అంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. నక్సలైట్లు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మధ్యవర్తిని పంపించి తన భర్తను కాపాడాలని, అందుకు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం సత్వరమే స్పందించాలని సింగ్ తమ్ముడు సుమిత్ విజ్ఞప్తి చేశారు. సింగ్ తల్తి కుంతీదేవి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. తాను తన కుమారుడితో మాట్లాడ్తానని, ఆయన్ని వెంటనే వెనక్కి తీసుకురావాలని ఆమె బఘేల్‌ను కోరారు. ఎన్‌ఎస్‌యుఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్‌కుందన్ చొరవతో ఆమె బఘేల్‌తో సంభాషించారు.

Relatives of jawan abducted in jammu-poonch road