- Advertisement -
మన తెలంగాణ/ఊట్కూర్ : మండల కేంద్రంలోని టిపాస్ ఉట్కూర్ శాఖ వారు మూడు రోజుల రిలేనిరాహారదీక్షలో భాగంగా శుక్రవారం దీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఆజమ్మ, కన్వీనర్ నారాయ ణలు మాట్లాడుతూ ఈనెల 5 నుంచి 10 వరకు గ్రామాల ప్రజల సమస్యల పై సర్వేలు చేసిన సందర్భంగా తమ దృష్టికి వచ్చాయని అమినాపూర్, పెద్ద జెట్రం, బిజ్వార్, నిండుగుర్తి గ్రామాల్లో స్మశాన వాటిక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ హామీలు అమలు కావడం లేదని సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో దేవారి అనం తమ్మ, అనురాధ, నర్సమ్మ, కథలప్ప కిష్టప్ప, లక్ష్మప్ప, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -