Home తాజా వార్తలు అదరగొట్టిన స్టార్లు

అదరగొట్టిన స్టార్లు

new Posters

 

దసరా పండుగను పురస్కరించుకొని స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల కొత్త పోస్టర్లను విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. అభిమానులకు కానుకగా ఈ పోస్టర్లు, న్యూలుక్‌లను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మహేష్ గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు వద్ద నిల్చున్న ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదేవిధంగా అల్లు అర్జున్ చిత్రం ‘అల వైకుంఠపురములో’ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో బన్నీ క్లాస్, మాస్ లుక్‌తో అదరగొట్టారు. ఇక సీనియర్ స్టార్ బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్య చేతిలో కత్తి పట్టుకొని రౌద్రంగా కనిపించారు.

Release of new Posters of Movies