Friday, April 26, 2024

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Release of notification for admissions in TS Model Schools

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ జి.ఉషా రాణి నోటిఫికేషన్ జారీ చేశారు. 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 8 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు జూన్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 8 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 5న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్ చూడాలని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News