Home తాజా వార్తలు సాగర్ డ్యాం 6 క్రస్టుగేట్ల నుండి నీటి విడుదల

సాగర్ డ్యాం 6 క్రస్టుగేట్ల నుండి నీటి విడుదల

Sagar Dam

 

నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువ నుండి 1,42,306 క్యూసెక్కుల నీరు వస్తుంది. దీనితో ఆదివారం సాగర్ 6 క్రస్టుగేట్ల నుండి నీటిని దిగువకు విడుదల చేశారు. 6 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి గేట్ల నుండి 90,078 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహంను అంచనావేస్తు నీటి విడుదలను చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 590.00 అడుగులు. సాగర్ జలాశయం నుండి కుడికాల్వ ద్వార 8,981 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వార 8,454 క్యూసెక్కుల నీటివిడుదల జరుగుతుంది, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వార 32,683 క్యూసెక్కులు ఎస్‌ఎల్‌బీసీ ద్వార 1,800 క్యూసెక్కుల నీరు విడుదల జరుగుతుంది.

సాగర్ జలాశయంకు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 1,42,306 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఆదివారం సాగర్ అందాలను వీక్షించడానికి పర్యాటకుల సంఖ్య కొంత పెరిగింది. సాగర్‌లోని కొత్త వంతెన, ప్రధాన విద్యుత్‌కేంద్రం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల జలపాతం వద్ద పర్యటకుల కొలాహలం నెలకొంది. నాగార్జునకొండకు లాంచీల రాకపోకలు లేకపోవడంతో లాంచీస్టేషన్‌కు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుతిరిగారు.

Released of water from 6 crust gates of Sagar Dam