Home తాజా వార్తలు రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారం వేగవంతం

రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారం వేగవంతం

Reliance green energy biz taking shape

 

న్యూఢిల్లీ : బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సోలార్, బ్యాటరీ, హైడ్రోజన్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకుగాను అనేక భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. దీంతో వచ్చే ఐదేళ్లలో కంపెనీ ప్రిటాక్స్ లాభంలో సుమారు 10 శాతం వరకు దోహదం చేయనుంది. ఈ విషయం నివేదిక అంచనాలో పేర్కొన్నారు. చమురు నుంచి రిటైల్ వరకు బహుళ వ్యాపార సంస్థలు కల్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆర్‌ఇసి, నెక్స్‌వేఫ్, స్టెర్లింగ్, విల్సన్, స్టీసల్, అంబ్రి వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ మొత్తం 1.2 బిలియన్ డాలర్లు ఉండనుంది. ఈ పెట్టుబడులతో పాటు సోలార్, బ్యాటరీ, హైడ్రోజన్ ద్వారా పూర్తిగా సమీకృత పునరుత్పాదక ఇంధ న పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు రిలయన్స్ సంస్థకు నైపుణ్యం, సాంకేతిక అంశాలు అవసరమవుతాయి. రిలయన్స్‌కు అవసరమైన సాంకేతికతను వాణిజ్య పరంగా నడిపించి, భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. క్లీన్ ఎనర్జీ సెక్టార్‌కు కీలక మెటీరియల్స్, ఫ్యూయెల్ సెల్స్ వంటి టెక్నాలజీలో రిలయన్స్ పెట్టుబడులను కొనసాగించనుంది.

Reliance green energy biz taking shape