Home తాజా వార్తలు నిరాశపర్చిన రిలయన్స్

నిరాశపర్చిన రిలయన్స్

Reliance Industries Q1 consolidated profit slips 7%

 

క్యూ1లో లాభం రూ.12,273 కోట్లు
గతేడాదితో పోలిస్తే 7 శాతం క్షీణత

న్యూఢిల్లీ : చమురు నుంచి టెలికాం వరకు బహుళ వ్యాపారాలు కల్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో నిరాశపర్చింది. క్యూ1(ఏప్రిల్‌జూన్) లో కంపెనీ నికర లాభం రూ.12,273 కోట్లతో 7.25 శాతం తగ్గింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ. 13,233 కోట్లుగా ఉంది. రిలయన్స్‌కు పన్ను వ్యయాలు రూ.3,464 కోట్లకు పెరగడంతో రూ.1.31 లక్షల కోట్లకు, అంటే ఖర్చులు 50 శాతం పెరిగాయి. కంపెనీ ఆదాయం రూ.91,238 కోట్ల నుంచి రూ.1.44 లక్షల కోట్లకు, అంటే 58 శాతం పెరిగింది. కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికీ, సంస్థ వేగంగా కోలుకుని మంచి వృద్ధిని నమోదు చేసినందు ఆనందంగా ఉందని అన్నారు. మార్కెట్‌లో కంపెనీ షేరు 0.71 శాతం పడిపోయి రూ.2,105 వద్ద ముగిసింది.

జియో లాభం 45 శాతం జంప్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ జూన్ ముగింపు త్రైమాసికంలో రాణించింది. జియో నికర లాభం రూ.3,651 కోట్లతో 45శాతం వృద్ధిని సాధించింది. ఆదాయం గతేడాదిలో రూ.17,254 కోట్ల నుంచి రూ.18,952 కోట్లకు, అంటే 10 శాతం పెరిగింది. ఆర్పు నెలకు సబ్‌స్ర్కైబర్‌కు రూ.138.4 నమోదైంది. ఎబిటా రూ.7,332 కోట్ల నుంచి రూ.8,892 కోట్లతో 21 శాతం పెరిగింది.

Reliance Industries Q1 consolidated profit slips 7%