Saturday, April 20, 2024

రిలయన్స్ రిటైల్ చేతికి జస్ట్ డయల్

- Advertisement -
- Advertisement -

Reliance Retail buys Just Dial

ముంబయి: వ్యాపార సంస్థల సమాచారం తెలిపే జస్ట్ డయల్‌లో మెజాటీ వాటా (66.9 శాతం) కొనుగోలుకు ముకేశ్ అబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) సిద్ధమైంది. సంస్థలో ప్రమోటర్లనుంచి 40.95 శాతం వాటాను కొనుగోలు చేయడానికి శుక్రవారం ఒప్పందం చేసుకొంది. ఇందుకోసం రూ.3,497 కోట్లు వెచ్చించనుంది. జస్ట్ డయల్ వ్యవస్థాపకుడు వివిఎస్ మణి మేనేజింగ్ డైరెక్టర్ , సిఇఓ హోదాలో సంస్థను ముందుకు నడిపించేలా ఈ ఒప్పందం కుదిరింది. కచ్చితంగా అమలయ్యేలా కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఆర్‌ఆర్‌విఎల్ కొనుగోలు చేస్తున్న 40.95 శాతం వాటాలో 25.33 శాతం వాటాలను (2.12 కోట్ల ఈక్విటీ షేర్లను) కంపెనీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జస్ట్ డయల్ కేటాయించనుంది. ఇందుకు ఒక్కో షేరుకు రూ.1022.25 చొప్పున ఆర్‌ఆర్‌విఎల్ చెల్లించనుంది.

వ్య్యవస్థాపకుడు వివిఎస్ మణినుంచి 1.31 కోట్ల షేర్లను (15.62శాతం వాటా) రూ.1020 చొప్పున కొనుగోలు చేయనుంది. మిగతా వాటాల కొనుగోలుకు పబ్లిక్ ఆఫర్ ప్రకటించింది. ఆర్‌ఆర్‌విఎల్ చొప్పిస్తున్న ఈ మూలధనాన్ని సంస్థ వృద్ధికి, విస్తరణకు వినియోగించనున్నట్లు జస్ట్ డయల్ తెలిపింది. ‘ లక్షల సంఖ్యలో ఉన్న మా భాగస్వామి వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల కోసం డిజిటల్ పర్యావరణ వ్యవస్థను మరితం పెంచేందుకే జస్ట్ డయల్‌లో వాటాను కొనుగోలు చేస్తున్నాం’ అని ఆర్‌ఆర్‌విఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. జస్ట్ డయల్‌ను 25 ఏళ్ల క్రితం మణి ప్రారంభించారు. రిలయన్స్ రిటైల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా బి2బి ప్లాట్‌ఫామ్‌పై మా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’ అని మణి తెలిపారు.

Reliance Retail buys Just Dial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News