Tuesday, April 16, 2024

రిలయన్స్ లాభం 39% తగ్గింది

- Advertisement -
- Advertisement -

 

 క్యూ4లో నికర లాభం రూ.6,348 కోట్లు
 గతేడాదిలో ఈ లాభం రూ.10,362 కోట్లు
 షేరుకు రూ .6.50 చొప్పున డివిడెండ్
 రూ.53,125 కోట్లతో దేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూ

న్యూఢిల్లీ: చమురు నుంచి టెలికాం వరకు బహుళ వ్యాపారాలు కల్గిన దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4 ఫలితాలపై కరోనా వైరస్ ప్రభావం కనిపించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసికం(జనవరిమార్చి :క్యూ4)లోసంస్థ రూ.6,348 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గతేడాది లాభం కంటే 38.73 శాతం తక్కువగా నమోదైంది. కంపెనీ స్టాక్ బిఎస్‌ఇలో 2.86 శాతం పెరిగి రూ .1,467 వద్ద ముగిసింది. అయితే ఒక నెలలో ఈ స్టాక్‌తో పెట్టుబడిదారులకు 80 శాతం లాభం ఇచ్చింది. మార్చి 23న ఈ స్టాక్ రూ.875 వద్ద ఉంది. ఇది ఏడాది కనిష్ట స్థాయి.
దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ
గురువారం విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో కంపెనీ మొత్తం ఆదాయం 2.30 శాతం తగ్గి రూ.1.39 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. గతేడాది సంస్థ ఆదాయం రూ.1,42,565 కోట్లుగా ఉంది. వీటితో పాటు రూ.53,125 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూను కూడా కంపెనీ ప్రకటించింది. రైట్స్ ఇష్యూ ఒక్కో షేరుకు రూ.1,257తో నిష్పత్తి 1:15గా నిర్ణయించారు. ఈ రైట్స్ ఇష్యూ వాటాదారులకు రిలయన్స్ వ్యాపారం వృద్ధిలో భాగస్వామి కావడానికి వీలు కల్పిస్తుంది. కంపెనీ ఈక్విటీ షేరుకు రూ.6.50 డివిడెండ్ ప్రకటించింది.
సంస్థ మెరుగైన పనితీరు:- ముకేశ్ అంబానీ
కరోనా వైరస్ మహమ్మారితో సవాలు సవాళ్లు ఉన్నప్పటికీ సంస్థ మరోసారి మంచి పనితీరును ఇచ్చిందని ఆర్థిక ఫలితాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు. సంస్థ ఒ2సి (ఆయిల్ టు కెమికల్స్) వ్యాపారాలు వాటి ఇంటిగ్రేటెడ్ పోర్ట్‌ఫోలియో, ఖర్చు పోటీతత్వం, ఉత్పత్తి, నియామక సామర్ధ్యాల కారణంగా నిరంతర ఆదాయాన్ని అందించాయని అన్నారు.
ఎస్ అండ్ పి రేటింగ్స్ స్థిరంగా
అంతకుముందు బుధవారం రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత రేటింగ్ బిబిబి ప్లస్‌గా నిర్ణయించింది. రిలయన్స్ కంపెనీ అప్పులు వచ్చే ఒకటి, రెండేళ్లలో తగ్గుతాయని ఏజెన్సీ తెలిపింది. సంస్థ వ్యయం, ఆస్తుల క్రమబద్ధమైన అమ్మకాలు, బలమైన లాభాలను కొనసాగించగల సామర్థ్యాన్ని పేర్కొంటూ ఏజెన్సీ ప్రస్తుత బిబిబి+ స్థాయిని కొనసాగించింది. జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఫేస్‌బుక్ గత వారం ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన నికర రుణాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం నుండి పొందే రూ .43,574 కోట్లు ఉపయోగించనుంది. ఫేస్‌బుక్‌తో ఈ ఒప్పందం డిజిటల్ వ్యాపారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధి సామర్థ్యాలను విస్తరిస్తుందని ఇరు సంస్థలు తెలిపాయి. ఫేస్‌బుక్ వాట్సాప్ అప్లికేషన్‌లో జియోమార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫేస్‌బుక్‌తో కలిసి పని చేస్తోంది.

Reliance’s profit Plunges 39% Amid Lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News