Saturday, April 20, 2024

కశ్మీర్‌కు తిరిగి వచ్చే పండితులను ఏ శక్తీ ఆపలేదు

- Advertisement -
- Advertisement -

CAA

 

మంగళూరు : కశ్మీర్‌కు తిరిగి వచ్చే పండితులను ఏశక్తీ ఆపలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సోమవారం స్పష్టం చేశారు. మేం ఎవరి విషయంలో జోక్యం చేసుకోం. మంగళూరులో ర్యాలీలో ప్రసంగిస్తూ ఎవరైనా మాజోలికి వస్తే వారిని శాంతిగా బతకనీయం అని పరోక్షంగా పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు. కశ్మీర్ లోయ నుంచి 1990 ప్రాంతంలో మిలిటెంట్ల బెడద కారణంగా పెద్ద ఎత్తున కశ్మీర్ పండితులు ఇతర ప్రాంతాలకు వలస పోయారని, ఇప్పుడు తిరిగి వచ్చే పండిట్‌లను ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ.. ఏ మతం వారి భావాలను కించపరిచే చట్టం ఇది కాదని, మతపరంగా హింసకు గురైన బాధితులకు ఊరట కలిగిస్తుందని చెప్పారు. మైనార్టీలైన హిందువులు, సిక్కులు భారత్‌కు తిరిగి వస్తే వారికి పౌరసత్వం కల్పించాలని నెహ్రూకు ఆనాడు మహాత్మాగాంధీ చెప్పారని ఆ ఆశయాలను ప్రధాని మోడీ నెరవేర్చడానికే ఈ చట్టం తెచ్చారని వివరించారు. బిజెపేతర రాష్ట్రాలు దీన్ని అమలు చేయడానికి వ్యతిరేకిస్తుండడంపై ఇది కేంద్ర చట్టమని, ప్రతివారు పాటించక తప్పదని అన్నారు. ఈ విషయంలో ప్రజలను కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తోందని, విపక్షంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ దేశానికి చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని విస్మరించరాదని వ్యాఖ్యానించారు.

Relief for Victims of Religious Violence with CAA
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News