Home తాజా వార్తలు చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

 Chennamaneni Ramesh  హైదరాబాద్ : వేములవాడ ఎంఎల్ఎ, టిఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రమేశ్ భారతీయ పౌరుడు కాదని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మంగళవారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారంలో రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. రమేశ్ పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేసింది. రమేశ్ పౌరసత్వం రద్దుపై కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను డిసెంబరు 16వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. రమేశ్ భారత పౌరుడు కాదని, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కొందరు బిజెపి నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే రమేశ్ పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పడంతో, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు చెప్పిన విషయాన్నే చెప్పింది. ఈ క్రమంలో  కేంద్ర హోంశాఖ అన్ని అంశాలను పరిశీలించి రమేశ్ భారత పౌరుడు కాదని, భారత్ లో ఎలాంటి అధికారాలు పొందేందుకు అనర్హుడని బుధవారం ప్రకటన చేసింది.

Relief To Chennamaneni Ramesh In High Court