Sunday, March 3, 2024

పాత బస్సులకు స్వస్తి

- Advertisement -
- Advertisement -

 RTC

 

వాటి స్థానంలో అద్దె బస్సులు చేరిక

హైదరాబాద్: ఆర్‌టిసిలో పాతబస్సులను తొలిగించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగని పూర్తి కండీషన్‌లో ఉన్న బస్సులు నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకోంది. కొత్త బస్సులతో పాత బస్సులు వదిలించుకోవాలని భావించినప్పటికీ.. బస్సుల కొనుగోలు చేసే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో అద్దె బస్సులను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే పాతబస్సులు తొలగిస్తుంది. త్వరలోనే 1,334 అద్దెబస్సులు ఆర్‌టిసిలోకి రానున్నాయి. ఈ క్రమంలో వాటి స్థానంలో 1,280 పాత బస్సులను తగ్గిస్తున్నారు. వాటిలో 54 బస్సులు నగరంలో నడుస్తుండగా.. ఇతర ప్రాంతాల్లో మిగిలిన 1,280 బస్సులు నడుపుతారు. అవసరాలను, రద్దీని బట్టి బస్సులు మార్పులు,చేర్పులు చేసే అవకావం ఉంది. దీంతో పూర్తి కండీషన్‌లో ఉన్న బస్సులే ఆర్‌టిసిలో నడుస్తాయి.

సమయపాలన, ఓఆర్‌పై ప్రత్యేక దృష్టి
అద్దె బస్సులు రావడంతో ఓఆర్‌పై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. సర్వీసులు అవసరమున్న రూట్లను గమనిస్తుంది. గ్రామీణప్రాంతాల్లోనూ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్న రూట్లపై అదనపు సర్వీసులు కేటాయించడంతో పాటు ఓఆర్ తక్కువగా ఉన్న రూట్ల లో సర్వీసులు కుదింపులతో సర్దుబాటు చేయనున్నది. ఇందుకు సంబంధించి ట్రైల్స్ రూపంలో బస్సులు నడిపి వాటి ఫలితాలను బట్టి అవసరమైతే మార్పులు చేర్పులు చేసే అధికారం అవసరం మేరకు ఆయా డిపో మేనేజర్లకు కల్పించేందుకు అధికారులు భావిస్తున్నారు.

అంతేకాదు సర్వీసుల వేళల్లోనూ సమయపాలన పాటించేందుకు ఆర్‌టిసి కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు కూడా తగు సూచనలు జారీచేసింది. ము ఖ్యంగా గ్రామాల్లో ఇటువంటి విధానం మంచి ఫలితాలు ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. వేళకు సరిగ్గా బస్సులు నడవడం వల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడమే కాకుండా ప్రయాణికులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. టైమ్ టూ టైమ్ సర్వీసుల వల్ల ప్రయాణికులు ఎక్కువ సేపు బస్టాండ్‌లో వేచివుండే అవకాశం ఉండదని, అదేవిధంగా బస్సులు ఫుల్ ప్యాక్‌తో రన్ అవుతాయని అంటున్నారు. ఇందుకు పక్కా ప్రణాళికలతో డిపో మేనేజర్లు వ్యవహరించాలని, సిబ్బందితో సమన్వయంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

కార్గో సర్వీసులకు పాతబస్సులు
ఆర్‌టిసిలో తొలగించే పాతబస్సులను కార్గో సేవలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రయాణానికి సాధ్యం కాని బస్సులను మరమ్మతులు చేసి సరుకు రవాణాకు ఉపయోగించాలని యాజమాన్యం భావిస్తోంది. కార్గోకు సరిపడ బస్సులు అందుబాటులో లేనందునే కార్గో సేవల ప్రారంభోత్సవం ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలోనే తొలుత 100 కార్గో బస్సులు పదిరోజుల్లో సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో కార్గో సేవలను వినియోగంలోకి తెచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Removal of old buses in RTC
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News