మనతెలంగాణ/మల్హర్: నయనగుళ్ళు పురాతన ఆలయాన్ని పునరు ద్ధరణకు శ్రీకారం చుట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని టిటిడి ఉమ్మ డి వరంగల్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్రరాజు (అశ్చుతానంద స్వామి) అన్నారు. సోమవారం మండలంలోని కొయ్యూరులో ఆలయ అభివృద్ధి కమిటి ఎన్నికకు హాజరై ఆయన మాట్లాడారు.భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని పివి నగర్ అటవీప్రాంతంలో మానేరు వంతెనెకు మల్లా రం వైపు మానేరు ఒడ్డున ఉన్న నయనగుళ్లు అతిపు రాతనమైన వని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఈప్రాంత వాసులపైన ఉందని ప్రజ ల సుభిక్షం కోసం దేవాలయాన్ని అబివృధ్ది చేసుకోవాలన్నారు. ఆలయానికి మహా లింగేశ్వరస్వామి అని నామకరణం చేశా రు. మహావివరాత్రిరోజు ఆలయంలో రుద్రాభిశేకం,శివపార్వతుల కళ్యాణం కమిటి ఆధ్వర్యంలో నిర్వహించబడు తా యని భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని దేవు ని దర్శణం పొందాలని కోరారు.ఆలయ కమిటీ చైర్మెన్‌గా వల్లెంకుంటకు చెందిన నారబాలయ్య, వైస్ చైర్మన్‌గా జంగ నారయణ, ప్రధాన కార్యదర్శిగా స్వామి, ప్రచార కార్యదర్శిగా మధు, డైరెక్టర్లుగా లక్ష్మయ్య, నారాయణ, శంకర్, రాజమ్మ, బాపులు ఎన్నికయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధ్దికి నోచు కోని ఆలయం కమిటీ ఏర్పడడంతో పునరుద్ధరణకు నోచుకోనుంది.
నయనగుళ్ల పునరుద్ధరణకు శ్రీకారం
- Advertisement -
- Advertisement -