Wednesday, April 24, 2024

Renuka Chowdhury: ప్రధాని మోడీపై రేణుకా చౌదరి పరువు నష్టం దావా వేస్తారా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పరువునష్టం దావా కేసు పెట్టారు. రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రధాని మోడీ మీద పరువు నష్టం దావా వేయబోతున్నారు. 2018లో పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ తనను ‘సూర్పనఖ’ అన్నందుకు ఆమె పరువు నష్టం దావా వేయబోతున్నారు. ‘చూద్దాం ఇప్పుడు కోర్టు ఎంత సత్వరంగా ప్రతిస్పందిస్తుందో’ అని రేణుకా చౌదరి ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ విషయంలో మాత్రం గుజరాత్ కోర్టు ఆదరా బాదరగా తీర్పునిచ్చేసింది.

తాను నవ్వినందుకు పార్లమెంటు సమావేశంలో ప్రధాని మోడీ తనను రామాయణంలో సూర్పనఖతో పోల్చి అవమానించారని రేణుకా చౌదరి పాత వీడియోను షేర్ చేశారు. తన పేరెత్తకుండానే రామాయణం సీరియల్‌లోని సూర్పనఖ పాత్రతో అవమానించారని ఆమె పేర్కొన్నారు. ‘నేను ఆయన(మోడీ) మీద పరువు నష్టం దావా వేస్తాను. చూద్దాం కోర్టు ఎంత సత్వరంగా పనిచేస్తుందో’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వాయ్‌నాడ్ పార్లమెంటు సభ్యుడైన రాహుల్ గాంధీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఈ దొంగలందిరికి ఉమ్మడిగా మోడీ ఇంటిపేరు ఎలా ఉంటోంది’ అన్నారు. దానిపై గుజరాత్‌కు చెందిని బిజెపి ఎంఎల్‌ఏ, మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ రాహుల్ గాంధీ మీద క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. సూరత్‌కు చెందిన కోర్టు ఏ మాత్రం జాప్యం చేయకుండా గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించేసింది. బహుశా రాహుల్ గాంధీని 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి తప్పించేయడానికి వేసిన ఎత్తుగడ ఇదేమోనని కూడా కొందరు అనుమానిస్తున్నారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ… ఇలా మోడీ లందరూ ఏదో ఒక కేసులో నిందితులు, దోషులే. అందుకనే రాహుల్ గాంధీ అలా వ్యాఖ్యానించారు. దానికి గోరంతలు కొండతలు చేసి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా వేసేసింది. అయితే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడైన రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ కోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. విచారణ సమయంలో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. పైగా తాను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని న్యాయమూర్తికి తెలిపారు.

కోర్టు తీర్పు వెలువడ్డాక రేణుకా చౌదరి ‘రాహుల్ గాంధీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు క్షమాపణలు చెప్పలేదు. ఫాసిజంకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు క్షమాపణ చెప్పలేదు. నిజం మాట్లాడుతున్నందుకు కూడా ఆయన క్షమాపణ కోరాలనుకోలేదు’ అని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News