Thursday, April 25, 2024

సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగాం: హరీష్ రావు

- Advertisement -
మెదక్:  రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరనుందని, సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగి చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆందోల్ నియోజకవర్గం తాలెల్మా గ్రామ శివారులో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు మాట్లాడారు.  మొత్తం 14 గ్రామాల్లో 3000 ఎకరాలకు సాగు నీటి కొరత తీరుతుందని, సమీపంలోనే సింగూరు జలాశయం ఉన్నా, ఈ ప్రాంతాలు తడిచే పరిస్థితి లేదని, ఇక్కడి ప్రాంతాల రైతులకు చుక్క నీరు అందలేదని, రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం 2017-18 లో తాలెల్మా శివారులో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రస్తుతం 3 వేల ఎకరాలు బీడు భూములకు నీరు అందిస్తామని, మొత్తం 6 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు.
కేంద్రంలోని బిజెపి ఒక్క ప్రాజెక్ట్ కు సాయం చేయడం లేదని, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకుంటోందని, కాంగ్రెస్ బిజెపి పార్టీలు‌ తెలంగాణ అభివృద్ధికి నిరోధకంగా తయారయ్యాయన్నారు. కర్ణాటకలోని ఎగువ భద్రకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారుని, బుందేల్ ఖండ్ లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారన్నారు. ఎపిలోని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని, మనం కాళేశ్వరానికో, పాలమూరు ప్రాజెక్టో అడిగితే మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు. మన రాష్ట్ర అభివృద్ధి మనమే చేసుకుంటున్నామని, కాంగ్రెస్ హయంలో పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చుకున్నామన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News