Wednesday, April 24, 2024

కోర్టులలో జస్టిస్ పోస్టుల భర్తీ అసంపూర్తి

- Advertisement -
- Advertisement -

Replacement of Justice posts in court is incomplete

 

న్యూఢిల్లీ : దేశంలో ప్రధాన న్యాయస్థానాలలో న్యాయమూర్తుల స్థానాలు కొన్ని ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా, మూడు హైకోర్టులు చాలా కాలంగా రెగ్యులర్ చీఫ్ జస్టిస్‌లు లేకుండానే సాగుతున్నాయి. వీటికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు. లేదా వేరే రాష్ట్రం హైకోర్టు సిజెలు అదనంగా వీటిని పర్యవేక్షిస్తున్నారు. న్యాయస్థానాలలో నెలకొని ఉన్న ఈ వెకెన్సీల గురించి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విషయాన్ని తెలియచేసినా వీటి భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలిజీయం నుంచి న్యాయమంత్రిత్వశాఖకు నియామక సిఫార్సులు ఇప్పటికీ చేరలేదని అనధికారికంగా వివరించారు.

సుప్రీంకోర్టుకు సంబంధించి 2019లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ అయ్యారు. తరువాత వరుసగా న్యాయమూర్తులు దీపక్ గుప్తా, ఆర్ భానుమతి, అరుణ్ మిశ్రాలు పదవివిరమణ పొందారు. దీనితో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నిజసంఖ్య 34. అయితే ఇప్పుడు 30 మంది న్యాయమూర్తులతోనే కోర్టు వ్యవహారాలు సాగుతున్నాయి. గువహతి, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పూర్తిస్థాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు లేరు. జడ్జిలకు పదోన్నతులు, రాజీనామాలు, ప్రత్యేకించి పదవీవిరమణలతో న్యాయస్ధానాలలో న్యాయమూర్తుల పదవులు ఖాళీ అయి ఉండటం న్యాయపరమైన నిర్వహణలో చిక్కులకు దారితీస్తోంది. పెండింగ్ కేసుల సమస్య తీవ్రం అవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News