Thursday, January 26, 2023

పంచరాయి భూములపై ప్రభుత్వానికి నివేదిక

- Advertisement -

clctr2

పాలకుర్తి: రాష్ట్ర ప్రభు త్వం 40 ఏండ్ల క్రితం బడుగు బలహీనులకు పంపిణీ చేసిన పంచరాయి భూములు చేతులు మారిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని, ఆ భూములు ఎవరకి ఇవ్వాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. హైదరాబాద్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ లక్ష్మి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో కొనసాగుతున్న భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన 80శాతం పూర్తయిందని అన్నారు. ప్రభు త్వం ఇచ్చిన గడువుకంటే ముందే పూర్తి చేసే లా అంకిత భావంతో అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. అడవి భూములతోపాటు ఇతర భూముల సమస్యల ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆమె వెంట స్టేషన్‌ఘనపురం రెవెన్యూ అధికారి రమేష్, తహశీల్ధార్ బన్సిలాల్, సర్పంచ్ అంజమ్మ, వీఆర్‌ఓలు యాకయ్య, శంకర్‌రావు, వెంకటేశ్వర్లు, సత్త య్య, పంచాయతీ కార్యదర్శి దోర్నాల మనోహర్ స్వామి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles