Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 Arya Vaishya Sangam

 

హైదరాబాద్ : ఆర్యవైశ్యులకు 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు సిఎం కెసిఆర్ చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్య నాయకులు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ కుల వృత్తుల సంఘాలకు నగరంలో భవనాల కోసం స్థలాలను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్యవైశ్య మహాసభకు ఐదు ఎకరాల భూమిని నగరంలోని ఉప్పల్ భగాయత్ లే ఔట్‌లో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Representatives of Arya Vaishya Sangam thanks to KCR