Friday, April 19, 2024

రిపబ్లిక్ బ్లాక్‌బస్టర్.. గణతంత్ర టికెట్లు హౌస్‌ఫుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈసారి గణతంత్ర దినోత్సవాల వేడుకలు తిలకించేందుకు జనం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వీక్షణకు దాదాపు 32000 టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడుపొయ్యాయి. ప్రజల కోసం విక్రయానికి పెట్టిన టిక్కెట్లు అన్ని కూడా అమ్ముడుపోవడం కీలక విషయం అని రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాలు పూర్తిగా తీర్చిదిద్దిన సెంట్రల్ విస్టా అవెన్యూలో జరుగుతాయి. ఈసారి తొలిసారిగా అధికారిక ఆహుతులందరికీ ఆన్‌లైన్‌లోనే స్వాగతాలు పంపించారు. ఈజిప్టు నుంచి ఓ సైనిక బృందం వేడుకలలో పాల్గొనేందుకు రానుంది. ఇంతకాలం రాజ్‌పథ్‌గా పిలవబడ్డ ఇప్పటి కర్తవ్యపథ్‌లో ఈసారి కవాతులు వేడుకగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకూ గణతంత్ర ఉత్సవాలు సాగుతాయని రక్షణ కార్యదర్శి గిరిధర్ అరామానే సౌత్‌బ్లాక్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గణతంత్ర దినోత్సవాలు పూర్తిగా ప్రజల ప్రాతినిధ్యం నడుమనే సాగుతాయని , ఈసారి వేడుకలకు పలువురు సామాన్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారని వివరించారు.

కూరగాయలు అమ్మేవారు, పాలవిక్రేతలు, దుకాణాలలో పనిచేసే వారు, రిక్షావాలాలు, కర్తవ్య పథ్‌లోని వర్కర్లు, సెంట్రల్ విస్టాలో పనిచేసే వందలాది మంది కార్మికులు , వారి కుటుంబ సభ్యులు ఈసారి ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారని గిరిధర్ చెప్పారు. కోవిడ్‌కు ముందు లక్ష మందికి పైగా జనం రాజ్‌పథ్‌కు వచ్చే వారు. తరువాత కోవిడ్ దశలో పలు ఆంక్షలతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈసారి దాదాపు 42000 మంది జనం హాజరు కానున్నారు. 32వేల టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టగా ఇవన్నీ అమ్మేసినట్లు, ఈ విధంగా జనం స్పందనను తాము నిర్థారించుకున్నట్లు తెలిపారు. ఈ నెలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజు 23 వ తేదీన ఉత్సవాలు ఆరంభిస్తారు. ఇవి గాంధీజీ వర్థంతి జనవరి 31వరకూ సాగుతాయని గిరిధర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News